ఇటీవల విడాముయార్చి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు అజిత్. అందాల నటి త్రిష హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా పరవాలేదనిపించే విజయం మాత్రమే అందుకుంది. ఇక దీని అనంతరం ప్రస్తుతం యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేస్తున్నారు అజిత్. ఈ మూవీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.
ఏప్రిల్ 10న దీన్ని గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీకి జీవి ప్రకాష్ సంగీతం సమకూరుస్తుండగా ఇందులో అజిత్ లుక్ అలానే రోల్ పవర్ ఫుల్ గా ఉంటాయని అంటున్నారు. విషయం ఏమిటంటే త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్ ఒక చిన్న కామియో పాత్రలో కనిపించనున్నారట.
ఎన్నో ఏళ్ల క్రితం సిమ్రాన్, అజిత్ కలిసి చేసిన వాలి మూవీ అప్పట్లో మంచి విజయం అందుకుంది. మళ్లీ ఎన్నో ఏళ్ళ అనంతరం మరొకసారి అజిత్, సిమ్రాన్ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లి లో నటిస్తుండడంతో ఇది కూడా భారీ విజయం ఖాయం అంటున్నారు. మొత్తంగా అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.