అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ జంటగా నటించిన చిత్రం ‘దృశ్యం’. మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించగా అదే టైటిల్‌తో వచ్చిన మలయాళ చిత్రానికి అధికారిక రీమేక్ గా హిందీలో తెరకెక్కింది.
ఈ చిత్రం 2015 లో విడుదలైంది. ఆ తర్వాత ఈ చిత్రం రెండవ భాగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడ్డారు. మరియు దాని సీక్వెల్ చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. కొంతమంది సీక్వెల్ ఇంకా విడుదల కావట్లేదు ఏంటని ఆశ్చర్యపోతూ చర్చించుకున్నారు. ఆ చర్చలకు ముగింపు పలికేలా ఈ సినిమా రెండో భాగాన్ని త్వరలో విడుదల చేయనున్నారు.
దృశ్యం 2015లో విడుదలైన తర్వాత, దాని తదుపరి భాగం దృశ్యం-2 2022లో విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను నిన్న అంటే అక్టోబర్ 17, 2022న అధికారికంగా విడుదల చేశారు. ఏడేళ్ల తర్వాత మరోసారి అజయ్ దేవగన్ అంటే సినిమాలో విజయ్ సల్గాంకర్ కేసును తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసే పోలీస్ అధికారి పాత్రలో అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు.
అజయ్ దేవగణ్ ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో దృశ్యం2 పోలికలను గురించి మాట్లాడుతూ.. “మేము మా చిత్రంలో కొత్త పాత్రలను పరిచయం చేసాము,” “కానీ మాతృకలో ఉన్న ఆత్మ అలాగే ఉంటుంది” అని అన్నారు.
ట్రైలర్ చూస్తే ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీక్వెల్ యొక్క అసలు వెర్షన్‌లో కనిపించని కానిస్టేబుల్ కమలేష్ సావంత్ అంటే లక్ష్మీకాంత్ గైతోండే పాత్రను మనం చూడవచ్చు. దృశ్యం మొదటి భాగంలో కూడా,ఒరిజినల్ తో పోలిస్తే హిందీ వెర్షన్ విజయానికి అవసరమైన స్వల్ప మార్పులు చేశారు.
దృశ్యం మరియు దృశ్యం 2 రెండు చిత్రాలు కూడా మలయాళం, తెలుగు మరియు కన్నడలో కూడా విజయవంతమయ్యాయి. పైన చెప్పినట్లుగా, మలయాళంలో మోహన్‌లాల్ నటించారు. తెలుగు వెర్షన్‌లో వెంకటేష్ మరియు కన్నడలో రవిచంద్రన్ ప్రధాన పాత్ర పోషించారు.
ఇప్పుడు హిందీ వెర్షన్ దృశ్యం 2 ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. అన్ని వైపుల నుండి ట్రైలర్ కు దక్కిన ఆదరణ చూస్తుంటే సినిమా విజయం గ్యారెంటీగా కనిపిస్తోంది.
దృశ్యం 2లో అజయ్ దేవగణ్ పాటు శ్రియా సరన్, అక్షయ్ ఖన్నా, టబు, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్ మరియు రజత్ కపూర్ వంటి భారీ తారాగణం ఉంది. దృశ్యం 2 నవంబర్ 18, 2022న థియేటర్లలో విడుదల కానుంది.