Homeసినిమా వార్తలుAgent - A Big Lesson: హీరోలు, దర్శకులు, నిర్మాతలకు పెద్ద గుణపాఠంలా నిలిచిన ఏజెంట్

Agent – A Big Lesson: హీరోలు, దర్శకులు, నిర్మాతలకు పెద్ద గుణపాఠంలా నిలిచిన ఏజెంట్

- Advertisement -

నిన్న విడుదలైన అఖిల్ అక్కినేని ఏజెంట్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన మిశ్రమ స్పందన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు దారుణంగా ఉండగా, దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో అఖిల్ పై ప్రచారంలో భాగంగా బడ్జెట్, మేకింగ్ గురించి ఎంతో హైప్ చేసి తీరా ఇలాంటి కంటెంట్ అందించారని చాలా విమర్శలు వస్తున్నాయి. ఏజెంట్ ఫలితం తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు, దర్శకులు, నిర్మాతలకు పెద్ద గుణపాఠంగా నిలిచిందనే చెప్పాలి.

“సరైన దిశలో అన్వయించుకోకపోతే కష్టపడ్డ పని కూడా వృథా అవుతుంది” అనే నానుడిని మన తెలుగు హీరోలు గుర్తు పెట్టుకోవాలి. వారు ఎంతో శ్రమ, సమయాన్ని వెచ్చించి తమ శరీరాన్ని ఒక సినిమా మార్చుకుంటున్నప్పుడు వారు పని చేస్తున్న సినిమా కంటెంట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. వారి కష్టానికి సానుభూతి మాత్రమే లభిస్తుంది, కానీ వారి సినిమా కంటెంట్ బాగా లేకుంటే మాత్రం ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు.

దర్శకుల విషయంలోనూ అంతే. వారు వారి విలువను గ్రహించాలి మరియు ఏదో భారీగా చేసేద్దాం అనే ఆశకి మరియు వారి నైపుణ్యానికి మధ్య సమతుల్యం పాటించడం ద్వారా వాస్తవికతలో ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది దర్శకులు తాము ఒక ఎపిక్ సినిమా తీస్తున్నామని అనుకుని, సాధారణ సినిమాలకు కూడా అనవసరంగా బడ్జెట్లు పెంచుతూ హీరోలు, నిర్మాతలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు.

READ  RRR: ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల స్నేహం కేవలం ఆర్ ఆర్ ఆర్ కోసం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా?

చివరగా నిర్మాతలు కూడా తమ సినిమా విషయంలో, బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాంబినేషన్ క్రేజ్ ను గుడ్డిగా నమ్మకుండా ఫలానా సినిమా మార్కెట్ పరిధిని మించకూడదు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు ప్రీ ప్రొడక్షన్ పనులకి వారు తగిన సమయం వెచ్చిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మారుతున్నాయి ఎందుకంటే సాధారణంగా ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా సినిమాను స్టార్ట్ చేయడం, ఆ తర్వాత షూటింగ్ టైంలో స్క్రిప్ట్ మార్పుల పై వర్క్ చేయడం వల్ల అనవసరమైన గొడవలు, రీషూట్ లు కూడా జరుగుతున్నాయి.

సినిమా అంటే టీమ్ వర్క్ అని, రిజల్ట్ పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా అన్నీ అందులో భాగమేనని అందరూ గమనించాలి. హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ కలిసి పూర్తి నమ్మకంతో సినిమా తీస్తేనే ఆ.సినిమా బాగుంటుంది. లేదంటే ఏజెంట్స్ టీం తమ సినిమా ఫలితంతో నేర్చుకున్న పెద్ద పాఠం మిగతా వారికి ఎదురవుతుంది.

READ  Naga Chaitanya - Akhil: ఏజెంట్, కస్టడీ సినిమాలను కలిసి ప్రమోట్ చేస్తున్న అక్కినేని సోదరులు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories