Home సినిమా వార్తలు Agent Collapsed: బాక్సాఫీస్ వద్ద పూర్తిగా కుప్పకూలిన ఏజెంట్

Agent Collapsed: బాక్సాఫీస్ వద్ద పూర్తిగా కుప్పకూలిన ఏజెంట్

అఖిల్ ‘ఏజెంట్’ ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏజెంట్ అందర్నీ నిరాశ పరిచి బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుండి డిజాస్టర్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా పరాజయం పాలైంది.

రెండో రోజు బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక పతనాన్ని చవిచూసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు కేవలం 70 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడంతో పాటు, టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లకు పైగా ఉండగా థియేట్రికల్ బిజినెస్ 37 కోట్లకు జరిగింది.

ఏజెంట్ సినిమా ఘోర పరాజయం అక్కినేని అభిమానులను తీవ్రంగా ప్రభావితం చేసింది. సోషల్ మీడియాలో వారు తమ అసహనాన్ని వెళ్లగక్కారు. అఖిల్, సురేందర్ రెడ్డి సినిమాలో ఎదో ఉందని చెప్పి ఇంత చెత్త కంటెంట్ ఇచ్చారని వారు విమర్శించారు. సమ్మర్ రిలీజ్ అయినప్పటికీ కంటెంట్, భయంకరమైన టాక్ కారణంగా ఏజెంట్ చిత్రం ఆ అడ్వాంటేజ్ ని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాల పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ సుంకర, పాటి దీపారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ విభాగంలో పని చేశారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రల్లో నటించారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version