శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అయితే విడుదలకు ముందు చాలా తక్కువ బజ్ మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలైంది. ఆకట్టుకునే ట్రైలర్ తో పాటుగా.. విడుదల దగ్గరయ్యే కొద్దీ సినిమాకు ప్రచారం కూడా బాగా చేశారు. అయినప్పటికీ, ఈ చిత్రానికి మార్నింగ్ మరియు మ్యాట్నీ షోల వరకు ధియేటర్ల వద్ద ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా నమోదయింది.
అయితే సాయంత్రం షోల నుండి ఈ చిత్రం కలెక్షన్లను పెంచుకోవడం పట్ల ఒకే ఒక జీవితం చిత్ర బృందం చాలా సంతోషం ఉంది. ఈ చిత్రం ఫస్ట్ షోల నుంచి ఎదుగుదలను సాధించింది. ఇక సెకండ షోల వద్ద అయితే మరింత అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. సెకండ్ షోలు చాలా ఏరియాల్లో హౌస్‌ఫుల్ గా నమోదు చేయటం విశేషం.
బ్రహ్మాస్త్ర సినిమా వల్ల నిజానికి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, ఒకే ఒక జీవితం కంటెంట్ లో ఉన్న బలం వల్ల నిలవగలిగింది. ఆరంభంలో చిన్నపాటి ఎదురుదెబ్బ తిన్నా, తిరిగి మళ్లీ పైకి లేచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకుంది. సినిమాకి ప్రేక్షకుల నుండి వచ్చిన పాజిటివ్ టాక్ కారణంగానే ఇది సాధ్య పడిందని చెప్పాలి. అటు విమర్శకులు ఇటు సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఇష్టపడ్డారు. కాగా ఈ సినిమాని మెచ్చిన ప్రేక్షకులు ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అనే టాగ్ తో పిలుస్తున్నారు. టైమ్ ట్రావెల్ వంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్ కు తోడు తల్లి కొడుకుల మధ్య భావోద్వేగ అనుబంధం చాలా చక్కగా మిళితం చేయబడిన ఈ సినిమా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. దాదాపు సినిమా చూసిన వారందరూ కూడా చాలా బాగుందనే టాక్ చెప్తున్నారు.
ఈ స్పందన చూస్తుంటే, ఓకే ఒక జీవితం క్రమంగా తన కలెక్షన్లను ఇదే స్థాయిలో పెంచుకుని మూడు రోజులకే బాక్సాఫీస్ వద్ద చాలా సునాయాసంగా బ్రేక్ ఈవెన్ సాధించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. సాధారణంగా చిన్న సినిమాలకు విడుదలకు ముందు పెద్దగా హైప్ ఉండదు కాబట్టి, వాటి ఫలితం ఎక్కువగా ప్రేక్షకులు చెప్పే టాక్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే అలాంటి సినిమాలకు మొదటి రోజు కన్నా తర్వాత రోజులలో కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఓకే ఒక జీవితం సినిమా కూడా మొదటి రోజు కంటే రెండవ రోజు మరిన్ని కలెక్షన్లను రాబట్టి, మూడవ రోజు అంతకన్నా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ తో పాటు ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రీతూ వర్మ మరియు అద్భుతమైన తల్లి పాత్రలో అమల అక్కినేని నటించారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. కాగా వర్ధమాన నటుడు మరియు దర్శకుడు అయిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాయగా, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించారు.