Homeసినిమా వార్తలుమేజర్ OTT విడుదల తేదీ ఖరారు

మేజర్ OTT విడుదల తేదీ ఖరారు

- Advertisement -

2008 ముంబై లోని ఉగ్ర దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “మేజర్” సినిమా గత నెలలో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

వాస్తవ సంఘటనలకు సినిమాటిక్ లిబర్టీ కాస్త జోడించి తెరకెక్కించిన మేజర్ అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులు సైతం మేజర్ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా తాజ్ హోటల్ లో సన్నివేశాలకు,క్లైమాక్స్ లోని భావోద్వేగాలకు ప్రేక్షకులు కంట నీరు పెట్టారు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

ఇక థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన తరువాత డిజిటల్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది మేజర్. నిజానికి ఈరోజుల్లో థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల్లో ఏ స్ట్రీమింగ్ సైట్ లో సినిమా రాబోతుంది అన్న ఆసక్తి కూడా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే మేజర్ సినిమా ఈ ఆదివారం అంటే జూలై 3న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. మిగతా భాషల వీక్షకులకి కూడా అందుబాటులో ఉండేలా తెలుగు,హిందీ మరియు మలయాళం లో విడుదల కానుంది.

READ  త్రివిక్రమ్ చెప్పిన కథ మెచ్చని మహేష్


ఇక మేజర్ తరువాత అడివి శేష్ తదుపరి చిత్రం “హిట్ సెకండ్ కేస్” విడుదలకు సిద్ధంగా ఉంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా 2020లో వచ్చిన హిట్ ఫస్ట్ కేస్ కి నిర్మాత అయిన నాని ఈ సీక్వెల్ కు కూడా నిర్మాతగా వ్యవహరించాడు. మాస్ రాజా రవితేజ “ఖిలాడి” లో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో మళ్ళీ కనిపించనుంది. ఆ తరువాత అడివి శేష్ తన కెరీర్ లోనే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న గూఢచారి -2 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండబోతున్నారు అని తెలిసింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Box-office : ఈ వారం సినిమాల రిపోర్ట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories