Home సినిమా వార్తలు దర్శకుడి అహంకారం వల్లే 2 స్టేట్స్ రీమేక్ ను రద్దు చేశాం అని చెప్పిన అడివి...

దర్శకుడి అహంకారం వల్లే 2 స్టేట్స్ రీమేక్ ను రద్దు చేశాం అని చెప్పిన అడివి శేష్

ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ప్రముఖ బాలీవుడ్ చిత్రం 2 స్టేట్స్. అర్జున్ కపూర్ మరియు అలియా భట్‌లు జంటగా నటించిన ఈ చిత్రం హిందీలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అడివి శేష్‌, శివాని రాజశేఖర్‌లతో రీమేక్‌ చేసేందుకు అప్పట్లో సన్నాహాలు చేశారు.

అయితే కొన్ని అంతర్గత సమస్యల కారణంగా ఈ రీమేక్‌కు తెరపడిపోయింది. ఈ ఆలస్యం పై నిర్మాత ఫిర్యాదు చేసినప్పటికీ, హీరోని తప్పుపట్టినప్పటికీ, శేష్ ఈ చిత్రానికి సంబంధించిన వివాదం పట్ల మౌనంగా ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఆయన ఈ విషయం పై మాట్లాడారు.

Idlebrain Jeeviకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అడివి శేష్ ఈ విషయం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అతనికి స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే షూటింగ్ సమయంలో దర్శకుడి ప్రవర్తన కూడా నచ్చలేదని, అతను చాలా అహంకారం ప్రదర్శించటం జరిగిందని, అందుకే సినిమాని ఆపేసామని శేష్ చెప్పారు.

https://twitter.com/idlebraindotcom/status/1597851471764107265?t=jkErEldUZoObZKucye2NsQ&s=19

అయితే, గూడచారి 2లో నిర్మాతకు వాటాతో నష్టపరిహారం ఇవ్వనున్నానని అడివి శేష్ తెలిపారు. ఇది అతనికి, నిర్మాతతో పాటు ప్రేక్షకులకు కూడా విన్-విన్ సిట్యుయేషన్ అవుతుంది.

శేష్ లాజిక్ ఇక్కడ మంచిదని చెప్పవచ్చు, ఎందుకంటే ఒక చెడ్డ సినిమా చేసి విడుదల చేస్తే అతని ఇమేజ్‌ను అనుకున్న దానికంటే ఎక్కువగా నాశనం చేస్తుంది. నిర్మాతల పట్ల ఆయనకున్న ఆరాటం కూడా తెల్సిందే. అందరు నటీనటులు ఈ విధంగా ప్రయత్నించినట్లయితే, ఎలాంటి అపార్థాలు జరగవు.

టూ స్టేట్స్ తెలుగు రీమేక్ 2019లో అడివి శేష్ మరియు శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో ప్రారంభించబడింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించాల్సి ఉంది. దీన్ని నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణ అట్టహాసంగా ప్రారంభించారు.

కానీ సినిమా మధ్యలో రద్దు చేయబడింది. అసలు సినిమా ఎందుకు ఆగిపోయిందో.. నిజంగా లోలోపల ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. అడివి శేష్ ఇచ్చిన తాజా సమాచారం తరువాత మాత్రమే ఈ ప్రాజెక్ట్ రద్దు వెనుక అసలు కారణం అందరికీ తెలిసింది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version