స్టార్‌డమ్ అంటే కంటెంట్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించగల సామర్థ్యం. ఒక నటుడిని స్టార్‌గా పరిగణించాలంటే ప్రేక్షకులలో అలాంటి విశ్వసనీయత ఉండటం ముఖ్యం. అలాంటి హీరోగా అడివి శేష్ మెల్లగా ఎదుగుతున్నారు. అయన తాజాగా నటించిన హిట్2 సినిమాతో, తను టాలీవుడ్ యొక్క టైర్ 2-స్టార్ జోన్‌లోకి ప్రవేశించారు.
ఈరోజు విడుదలైన హిట్ 2 సినిమా అందరి అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద చక్కని ఓపెనింగ్స్ అందుకుంది. విజయ్ దేవరకొండ, రామ్, నాని తదితర యువ స్టార్ హీరోల స్ధాయితో సమానంగా హిట్2 ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఉన్నాయి.
ఓపెనింగ్స్ రేంజ్ మరియు హిట్ 2 విడుదలకు ముందు సృష్టించిన అంచనాల పరిమాణం కలగలిపి శేష్‌ని తెలుగు సినిమా టైర్ 2 లీగ్ లో చేరేలా చేసాయి. మరియు అతని గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతూ పటిష్టంగా తయారు అవుతుంది.
కాగా అడివి శేష్ కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా తన స్క్రిప్ట్‌లను రాసుకుంటూ, క్షణం, మేజర్ వంటి అనేక బ్లాక్‌బస్టర్‌లను రూపొందించారు. ఈసారి అతను ఇతర రచయిత మరియు దర్శకుడు అయిన శైలేష్ కొలను రాసిన హిట్ 2 సినిమాలో పని చేసారు.
అతని తదుపరి చిత్రాలు గూఢచారి 2 మరియు హిట్ ఫ్రాంచైస్ యొక్క తదుపరి చిత్రాల వంటి లైనప్ మరింత ఆశాజనకంగా ఉన్నాయి. అడివి శేష్ స్క్రిప్ట్ జడ్జిమెంట్‌లో పర్ఫెక్ట్ కాబట్టి, అతని సినిమాలలో మినిమమ్ కంటెంట్ మరియు కొంత ఫ్రెష్‌నెస్ కూడా ఉంటాయి. తను చేసే సినిమాల కోసం ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అడివి శేష్ చేసే తదుపరి చిత్రాలతో కేవలం తన కెరీర్‌కు సహాయపడటమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలను మరింత బలోపేతం చేయడానికి మరిన్ని ఆసక్తికరమైన ఆలోచనలు మరియు కొత్త తరహా కాన్సెప్ట్ తో ముందుకు వస్తారని ఆశిద్దాం.