Homeసినిమా వార్తలుహిట్ వర్స్ లో బాలకృష్ణను నటించమని కోరిన అడివి శేష్

హిట్ వర్స్ లో బాలకృష్ణను నటించమని కోరిన అడివి శేష్

- Advertisement -

అడివి శేష్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ 2 థియేటర్లను షేక్ చేస్తోంది. తాజాగా ఈ క్రేజీ థ్రిల్లర్ ను చూసేందుకు నటసింహం నందమూరి బాలకృష్ణను హిట్ చిత్ర బృందం ఆహ్వానించింది. తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి బాలకృష్ణ ఈ సినిమా చూశారు. శేష్, బాలయ్యతో పాటు నాని కూడా వచ్చారు.

ఇక స్క్రీనింగ్ తరువాత చర్చల సందర్భంగా అడివి శేష్ హిట్ వర్స్ అతిధి పాత్రలో నటించమని బాలయ్యను ఆహ్వానించారట. అయితే అందుకు బాలయ్య మాత్రం చిరునవ్వు నవ్వి ఊరుకున్నారట. అయన చిరునవ్వును అర్థం చేసుకోవడం కష్టం, కానీ బాలయ్య తనకు నచ్చకపోతే ముఖం పైనే ఖరాకండిగా లేదు అని చెప్పే వ్యక్తి అని పేరుంది.

https://twitter.com/AdiviSesh/status/1599388489275314177?t=08IiPMLjwC1tq2YK7pAxnQ&s=19

ఇక అడివి శేష్ చేసిన ట్వీట్ ను బట్టి బాలయ్యకు హిట్ 2 సినిమా బాగా నచ్చిందని, శైలేష్ డైరెక్షన్ ను, అడివి శేష్ నటనను కూడా ఆయన బాగా మెచ్చుకున్నారని తెలుస్తుంది.

ఇటీవల జరిగిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య స్వయంగా గూఢచారి సిరీస్ లో ఒక భాగం కావాలనే ఆశ ఉన్నట్లు చెప్పారు. అడివి శేష్ తన సినిమాలో బాలయ్య అతిధి పాత్ర చేస్తాను అనడం చూసి థ్రిల్ అయ్యారు. బాలకృష్ణ ఆలోచనకు శేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బాలయ్య తాను కనెక్ట్ అయ్యే వ్యక్తులను ప్రోత్సహించడంలో సిద్ధహస్తుడు. అందుకే ఈ కాంబినేషన్ సులభంగా జరిగే వీలుంది. గతంలో మంచు మనోజ్ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో నటించారు. అలాగే ఇటీవల విశ్వక్ సేన్ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు కూడా వెళ్లారు.

READ  ఆటో ఇమ్యూన్ కండీషన్ తో బాధ పడుతున్న సమంత

అడివి శేష్ యొక్క ఈ అభ్యర్థనను మరింత పరిగణనలోకి తీసుకొని బాలకృష్ణ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే బాలయ్య అభిమానులు ఆయనని హిట్ వర్స్ లో భాగంగా ఒక కూల్ పోలీస్ పాత్రలో చూసి తప్పకుండా థ్రిల్ అవుతారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories