ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన అభిమానులకు కొత్త పోస్టర్ కానుకగా ఇచ్చిందీ ఆదిపురుష్ యూనిట్. కాగా ఈ పోస్టర్ లో రాముడిగా ప్రభాస్ బాణాన్ని సంధించడానికి సిద్ధమవుతోన్నట్లుగా వీరోచితమైన లుక్ లో ప్రభాస్ కనిపిస్తున్నారు.
అయితే ఈ లుక్ మరియు పోస్టర్ ప్రభాస్ అభిమానులే కాదు ఇతర సినీ ప్రేక్షకులను కూడా అంతగా ఆకట్టుకోలేదు. ప్రభాస్ లాంటి హీరోని ఏమాత్రం సరిగా చూపించకపోవటం కేవలం ఓం రౌత్ వైఫల్యం మాత్రమేనని అందరూ అభిప్రాయ పడుతున్నారు.
నిజానికి ఈ నెల ప్రారంభంలో అయోధ్యలో ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఆ సందర్భంలోనే టీజర్ లోని విజువల్స్, ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్స్ పై చాలా విమర్శలొచ్చాయి. ఈ సినిమాపై పలు హిందుత్వ సంఘాలతో పాటు రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు.
అయితే త్రీడీ టీజర్‌తో ఈ విమర్శల తాకిడికి కొంత వరకు అడ్డుకట్ట వేసింది చిత్ర బృందం. అయితే మళ్ళీ ఈరోజు పోస్టర్ తో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే కొంత మంది ప్రేక్షకులు మాత్రం టీజర్ కంటే ఈ పోస్టర్ బాగానే ఉందని అన్నారు.
ఆది పురుష్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న భారీ స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇటీవలే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాదని, వాయిదా పడే అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి. మరి నిజానిజాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
రామాయణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. చెడుకు ప్రతీకగా నిలిచిన రావణుడి పై రాముడు సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్షన్స్‌లో దాదాపు ఐదు వందల కోట్ల వ్యయంతో ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. జానకిగా కృతిసనన్ నటిస్తుండగా.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. ఇక లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.