Home సినిమా వార్తలు Vijaya Shanthi: రానా నాయుడు చేసిన వెంకటేష్, రానాలపై నటి విజయశాంతి ఫైర్

Vijaya Shanthi: రానా నాయుడు చేసిన వెంకటేష్, రానాలపై నటి విజయశాంతి ఫైర్

ఇటీవల విడుదలైన తెలుగు ఓటీటీ సిరీస్ ల పై నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి శుక్రవారం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆమె నేరుగా ఏ హీరో, వెబ్ సిరీస్ పేరు ప్రస్తావించకపోయినా తన వ్యాఖ్యలు రానా నాయుడు ను ఉద్దేశించినవే అని అందరికీ అర్థమయింది.

ఓటీటీ వెబ్ సిరీస్ లు, ఇతర షోలకు కూడా సెన్సార్షిప్ అవసరమని ఆమె అన్నారు. అంతే కాకుండా ఓటీటీలో మహిళలకు వ్యతిరేకంగా చూపించే అశ్లీల కంటెంట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఓటీటీలో కంటెంట్ క్రియేటర్లు మహిళల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఓటీటీ కంటెంట్ విషయంలో స్టార్స్, ప్రొడ్యూసర్స్ జాగ్రత్తగా ఉండాలని విజయశాంతి అన్నారు. నటీనటులకు ప్రేక్షకులు ఇచ్చే అభిమానాన్ని మరింత గౌరవంగా ఉంచాలని తాను నమ్ముతున్నానని విజయశాంతి అన్నారు.

వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన నెట్ ఫ్లిక్స్ లోని సిరీస్ రానా నాయుడు ఈ నెల ప్రారంభంలో విడుదలైంది, ఇందులోని అడల్ట్ కంటెంట్ పై చాలా పేలవమైన సమీక్షలు మరియు విమర్శలు వచ్చాయి. అయితే ఈ క్రైమ్ డ్రామాలో వెంకటేష్, రానాలు నటించడంతో ప్రేక్షకులు రికార్డు స్థాయిలో ఈ షోను వీక్షించారు.

మొదటి వారంలో, రానా నాయుడు 8,070,000 గంటల వీక్షణలను సాధించింది, ఇది అత్యధికంగా వీక్షించబడిన ఆంగ్లేతర సిరీస్లలో పదో స్థానంలో ఉంది – మరియు ఈ సంఖ్యలు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే కావడం విశేషం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version