శ్రీలీల తన తొలి చిత్రం పెళ్లి సందడిలో తన అందం, అభినయంతో యూత్ ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి నటిగా అద్భుతమైన ఆఫర్లు, క్రేజ్ ను కూడా అందుకున్నారు. కాగా ఆమెని స్క్రీన్ పై చూసి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు.
రవితేజ నటించిన ధమాకా సినిమాకు మంచి కలెక్షన్లు రావడానికి శ్రీలీల కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆమె తన నటన, డ్యాన్సులతో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచారు. తన ఎనర్జీ లెవల్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేయగా ఈ సినిమా ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.
కాగా ఇప్పుడు శ్రీలీల క్రేజ్ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ లోని ఇతర నటీమణులు తమ రెమ్యునరేషన్లను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రష్మిక మందన్న, పూజా హెగ్డే, సమంత, శృతి హాసన్, కీర్తి సురేష్, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్లు 3 నుంచి 4 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే ధమాకా సినిమాతో శ్రీలీల అన్ని వర్గాల ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు పైన చెప్పినట్టు ఆ సినిమా విజయానికి ఆమె ప్రధాన కారణంగా కూడా నిలిచారు. ఇప్పటికే మహేష్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలకు సైన్ చేసిన ఆమెకు ఇప్పుడు ఇతర భారీ సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి.
మరో విషయం ఏంటంటే మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఆమె చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక నిర్మాతలు ఇతర ప్రముఖ నటీమణులకు ఈ విషయాన్ని చూపిస్తున్నారు. కాగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొందరు నటీమణులు తమ రెమ్యునరేషన్లను తగ్గించుకునేందుకు సిద్ధపడినట్లు తాజా సమాచారం.