Homeసినిమా వార్తలుతన ఆరోగ్యం గురించి చెప్తూ భావోద్వేగానికి గురైన సమంత

తన ఆరోగ్యం గురించి చెప్తూ భావోద్వేగానికి గురైన సమంత

- Advertisement -

నటి సమంత ఆరోగ్యం గురించి ఇటీవల రకరకాల వార్తలు వచ్చాయి. తన ప్రాణానికి హని ఉన్నట్లు, పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.అయితే సమంత నటించిన తాజా చిత్రం యశోద విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంభందించిన ఒక ప్రచార ఇంటర్వ్యూలో భాగంగా సమంత తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరణ ఇచ్చారు.

తన పరిస్థితితో పోరాడుతూ తాను వెళ్లిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, సమంత భావోద్వేగ స్వరంతో మాట్లాడారు.ఇక మీడియా నివేదించిన విధంగా తాను ప్రాణాపాయ దశలో లేనని కూడా స్పష్టం చేసారు. మరియు ఆమె ఆరోగ్యం గురించి నివేదించేటప్పుడు మీడియా వారి అతిశయోక్తిని కాస్త నివారించి ఉండాల్సిందని ఆమె కోరుకున్నారు.

సోమవారం, సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో తాను యశోద ప్రమోషన్‌ల కోసం సిద్ధమవుతున్నట్లు రాసారు. ఆమె ప్రమోషనల్ ఇంటర్వ్యూ నుండి ఒక క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. అందులో సమంత తన ఆరోగ్య పరిస్థితిని ఎలా ఎదుర్కొంది అనే దాని గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడటం మనం చూడవచ్చు.

READ  ఆఫ్ స్క్రీన్ చేసిన ఓవర్ యాక్షన్ వల్లే మంచు విష్ణు బాక్సాఫీస్ వద్ద జీరోగా మారారా?

భావోద్వేగానికి గురైన సమంత ఇలా అన్నారు. “నేను నా పోస్ట్‌లో (ఇన్‌స్టాగ్రామ్) చెప్పినట్లు, కొన్ని రోజులు మంచివి, కొన్ని చెడ్డవి. కొన్ని రోజులు, మరో అడుగు వేయడం కూడా కష్టమని నేను భావించాను. కానీ నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, నేను చాలా కష్టాలు అనుభవించాను మరియు ఇంత దూరం వచ్చాను అని నేను ఆశ్చర్యపోతున్నాను. నేను పోరాడటానికే ఇక్కడ ఉన్నాను.”

అదే క్లిప్‌లో, సమంత తన పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో లేనని స్పష్టం కూడా చేయటం జరిగింది. “నేను ఒక విషయం క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. నా పరిస్థితి ప్రాణాపాయంగా ఉందని వివరించే లెక్కలేనన్ని కథనాలను చూశాను. నేను ఉన్న దశ నిజానికి ప్రాణాపాయం కాదు. ప్రస్తుతానికి, నేను ఇంకా చనిపోలేదు. నా ఆరోగ్యం పైన అన్ని రకాల ముఖ్యాంశాలతో కూడిన వార్తలు అంతగా అవసరం అని నేను అనుకోను,” అని సమంత చెప్పారు.

Samantha talks about her health in a latest interview

సినీ నటీనటులపై రూమర్స్, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అయితే సమంత అనారోగ్యం విషయంలో మీడియాను పూర్తిగా నిందించలేం. ఎందుకంటే సమంతకు సోకిన మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధి ప్రమాదకర లక్షణాలతో ఉంది. అందుకే ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మీడియా పేర్కొంది.

ఇక సమంతకి మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే నవంబర్ 11న సమంత నటించిన యశోద చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. సమంత మళ్లీ పూర్తి ఆరోగ్యంతో కుదుటపడి వరుస సినిమాలు చేయాలని కోరుకుందాం.

READ  మాట మీద నిలబడ్డ విజయ్ దేవరకొండ

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories