Homeసినిమా వార్తలుబాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి రోజా

బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి రోజా

- Advertisement -

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్ఆర్ యూనివర్శిటీగా మార్చడం పై గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కింది. ఇలా ఈ వివాదం కొనసాగుతూ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను కూడా తాకింది. అందరూ ఊహించిన విధంగానే, నందమూరి బాలకృష్ణ ఎప్పటిలానే దూకుడు పద్ధతిలో ఈ సమస్య పై స్పందించారు. అంతే కాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై కొన్ని తనదైన శైలిలో గట్టి పదాలను ఉపయోగించి విమర్శలు గుప్పించారు.

అయితే అందుకు బదులుగా, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, నటి రోజా స్పందిస్తూ బాలయ్య పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాగా బాలకృష్ణను దూషించడం కోసం ఆయన నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సింహ నుండి బాగా పాపులర్ అయిన డైలాగ్‌ను ఉపయోగించుకుని ట్వీట్ చేయడం గమనార్హం.

https://twitter.com/RojaSelvamaniRK/status/1573811634384302081?t=EUVhw4BcUQmoEg61-kv7pA&s=19

మరి రోజా ఈ విధంగా మాట్లాడటం పట్ల, ఆవిడ స్పందించిన తీరు పట్ల బాలకృష్ణ ఎలా స్పందిస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ వివాదంపై కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించటం జరిగింది.

READ  అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కు అభిమాని - బండి సంజయ్

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్‌లో, “ఎన్టీఆర్ మరియు వైఎస్ఆర్ ఇద్దరూ అపారమైన ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఒకరి పేరును మరొకరితో భర్తీ చేయడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, అలాగని ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. యూనివర్శిటీ పేరు మార్చడం వల్ల ఎన్టీఆర్ సంపాదించిన కీర్తిని, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆయన ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన జ్ఞాపకాలను చెరిపివేయలేము” అని స్పందించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యూనివర్శిటీ పేరును ఇలా ఇష్టమొచ్చిన రీతిలో మార్చేయడం వల్ల అందరి కంటే ఎక్కువ బాధ, ఇబ్బంది పడేది విద్యార్థులే.

టిడిపి పార్టీ నేతలు, లేదా ఆ పార్టీ శ్రేణులు కావచ్చు. విద్యార్థుల వైపు నిలబడి ఒక క్రమ పద్ధతిలో పోరాటం చేస్తే అది వారికి తప్పకుండా గౌరవం చేకూరుస్తుంది. అంతే కానీ సీనియర్ ఎన్టీఆర్ కు అవమానం జరిగిందంటూ మొత్తం వ్యవహారాన్ని కేవలం టిడిపి పార్టీ లేదా నందమూరి కుటుంబానికి మాత్రమే పరిమితం చేస్తే అది ఎంత మాత్రం సబబు కాదని పలు వర్గాల నుండి వాదన వినిపిస్తోంది. మరి ఈ వాదన లోనూ న్యాయం ఉంది కదా.

Follow on Google News Follow on Whatsapp

READ  కొత్త ఇల్లు కొన్న తమిళ హీరో విజయ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories