తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుత పరిస్తితిలో హీరోయిన్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తొలి చిత్రం సీతారామంతో అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ సినిమా విజయంతో ఇప్పుడు మృణాల్ తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది అని చెప్పవచ్చు.
ఒక్కోసారి సినిమా పరిశ్రమలో కేవలం ఒకే ఒక సినిమాతో దశ తిరిగి పోతుంది. స్టార్ స్టేటస్ దక్కాలి అంటే కొన్ని సార్లు ఒక్క సినిమా సరైన విధంగా ప్రభావం చూపితే చాలు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ విషయంలో అదే జరిగింది.
దుల్కర్ సల్మాన్ తో కలిసి ఆమె చేసిన సీతారామం సినిమా అన్ని భాషల్లో కూడా మంచి స్పందనను సొంతం చేసుకుంటుంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఆమె దుల్కర్ సల్మాన్ తో సమానంగా నటించింది అని చెప్పవచ్చు. ఆ పాత్రకు తగ్గట్టుగా మృణాల్ ఠాగూర్ నటించి ప్రేక్షకులు మరియు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
హీరో దుల్కర్ కూడా సీత పాత్రకి మృణాల్ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు అని కూడా అన్నారు. అయితే ఈ పాత్ర కోసం మొదట కొంతమంది హీరోయిన్లను సంప్రదించారట. కానీ రకరకాల కారణాల వలన ఆ హీరోయిన్లు ఎవరు కూడా ఈ పాత్రలో నటించడం కుదరలేదట. అయితే ఆ లిస్ట్ లో ప్రస్తుత నంబర్ వన్ హీరోయిన్ పూజా హెగ్డే పేరు వినిపిస్తుండటం విశేషం.
సీతా రామం సినిమాలో పూజా హెగ్డేను నటింప జేసెందుకు దర్శక నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేశారట. అయితే కరోనా వేవ్ ల నేపథ్యంలో ఇతర సినిమాల షూటింగులు డేట్స్ తో బిజీగా ఉండటంతో పూజ హెగ్డే ఈ పాత్రను చేయలేక పోయారట. డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్ల ఈ అవకాశాన్ని వదులుకోవల్సి వచ్చిందట.
అయితే సీతారామం సినిమాలో నటించిన మృణాల్ ఠాగూర్ మాత్రం సీత పాత్రకు 100% న్యాయం చేసి తన ప్రతిభను నిరూపించుకుంది.. మరి ఈ క్రమంలోనే చక్కని ఆరంభాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోలతో కూడా నటించే అవకాశాలు దక్కించుకోవాలి అని కోరుకుందాం.