Home సినిమా వార్తలు Malavika Mohanan: పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం పై వస్తున్న పుకార్లను ఖండించిన...

Malavika Mohanan: పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం పై వస్తున్న పుకార్లను ఖండించిన నటి మాళవిక మోహనన్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భాగమైన అనేక ప్రాజెక్టులలో పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్‌తో గతంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం దళపతి విజయ్ నటించిన తెరి తెలుగు రీమేక్ అని అంటున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ మాళవిక మోహనన్ నటిస్తున్నట్లు ఈరోజు కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే, మాళవిక అధికారికంగా స్పందిస్తూ ఆ పుకార్లను కొట్టిపారేసారు మరియు తాను ఉస్తాద్ భగత్ సింగ్‌లో భాగం కాదని స్పష్టం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పట్ల తనకు విపరీతమైన అభిమానం ఉందని తెలిపారు.

మాళవిక తన తెలుగు అరంగేట్రం ఒక అద్భుతమైన చిత్రంతో చేస్తానని పేర్కొన్నారు మరియు ఆ చిత్రంలో రెండవ హీరోయిన్ కాకుండా అందులో ప్రధాన హీరోయిన్ పాత్రను పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ క్రమంలో మాళవిక ఏ సినిమా పేరును ప్రస్తావించలేదు, కానీ ఇక్కడ ఆమె మారుతీ దర్శకత్వంలో ప్రభాస్‌తో తన ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించినట్లు అందరికీ అర్థమైంది. ఉస్తాద్ భగత్ సింగ్‌లో తాను ఉన్నారనే గాసిప్స్‌ పై మాళవిక తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా వివరణ ఇచ్చారు.

https://twitter.com/MalavikaM_/status/1638124780049268738?t=veFBoLRN8Hvb_XOF2DLxqQ&s=19

సూపర్ స్టార్ రజినీకాంత్‌ పెట్టా చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించి ఆ పైన విజయ్‌ మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవిక మోహనన్‌ తన గ్లామర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version