పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భాగమైన అనేక ప్రాజెక్టులలో పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్‌తో గతంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం దళపతి విజయ్ నటించిన తెరి తెలుగు రీమేక్ అని అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ మాళవిక మోహనన్ నటిస్తున్నట్లు ఈరోజు కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే, మాళవిక అధికారికంగా స్పందిస్తూ ఆ పుకార్లను కొట్టిపారేసారు మరియు తాను ఉస్తాద్ భగత్ సింగ్‌లో భాగం కాదని స్పష్టం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పట్ల తనకు విపరీతమైన అభిమానం ఉందని తెలిపారు.
మాళవిక తన తెలుగు అరంగేట్రం ఒక అద్భుతమైన చిత్రంతో చేస్తానని పేర్కొన్నారు మరియు ఆ చిత్రంలో రెండవ హీరోయిన్ కాకుండా అందులో ప్రధాన హీరోయిన్ పాత్రను పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ క్రమంలో మాళవిక ఏ సినిమా పేరును ప్రస్తావించలేదు, కానీ ఇక్కడ ఆమె మారుతీ దర్శకత్వంలో ప్రభాస్‌తో తన ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించినట్లు అందరికీ అర్థమైంది. ఉస్తాద్ భగత్ సింగ్‌లో తాను ఉన్నారనే గాసిప్స్ పై మాళవిక తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా వివరణ ఇచ్చారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ పెట్టా చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించి ఆ పైన విజయ్ మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవిక మోహనన్ తన గ్లామర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.