Homeసినిమా వార్తలుమరో భారీ ప్యాన్ ఇండియా సినిమా సీక్వెల్ లో నటించనున్న కాజల్ అగర్వాల్

మరో భారీ ప్యాన్ ఇండియా సినిమా సీక్వెల్ లో నటించనున్న కాజల్ అగర్వాల్

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమా ‘చంద్రముఖి’కి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి రజనీకాంత్‌కు బదులుగా రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు పి. వాసు మొదట రజనీకాంత్‌తో ఈ సీక్వెల్‌ను రూపొందించాలని అనుకున్నారు, కాని కొన్ని తెలియని కారణాల వల్ల ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు, ఆ తరువాత ఆయన అదే సినిమాను లారెన్స్‌తో తీయాలని నిర్ణయించుకున్నారు.

కాంచన సిరీస్‌తో హారర్ చిత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు రాఘవ లారెన్స్‌. ఇప్పుడు ఆ క్రేజ్ కు చంద్రముఖి సీక్వెల్ కూడా తొడవటంతో ఈ సినిమా ప్రకటించిన రోజు నుండే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు కొద్ది రోజుల బ్రేక్ ఇచ్చి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న కాజల్ అగర్వాల్ ను చంద్రముఖి పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. కొంతకాలం గ్యాప్ తరువాత ఆమె ఇప్పటికే వాణిజ్య ప్రకటనలు చేయడం ప్రారంభించింది. అలాగే సినిమాల్లోకి తిరిగి రావడానికి కూడా సిద్ధంగా ఉంది.

READ  పుష్ప-2 లో ఐటెం సాంగ్ కు స్టార్ హీరోయిన్ కన్ఫర్మ్ ?

ఇందులో ప్రధాన పాత్ర కోసం కాజల్ అగర్వాల్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో మరో ఆరుగురు నటీమణులు కూడా ఉన్నట్లు సమాచారం. కాజల్‌ కూడా మళ్లీ తెర మీదకు రావడానికి ఇదే సరైన ఆఫర్‌ అని భావించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై త్వరలోనే అధికారిక ధృవీకరణ వచ్చే అవకాశం ఉంది.

గ్లామర్, హ్యాపీ హీరోయిన్ పాత్రలకు పేరు తెచ్చుకున్న కాజల్ చంద్రముఖి పాత్రలో కనిపించడం అనే విషయం ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి భాగంలో టైటిల్ రోల్ పోషించిన జ్యోతిక అద్భుతమైన నటనను ప్రదర్శించి రజనీకాంత్ నే డామినేట్ చేసిన సంగతి తెలిసిందే. మరిప్పుడు కాజల్ కు ఖచ్చితంగా మొదటి భాగంతో పోలికలు ఉంటాయి. ఈ సవాల్ ను కాజల్ ఎలా స్వీకరిస్తుంది అనేది చూడాలి.

కాగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చంద్రముఖి-2.. మొదటి పార్ట్‌తో ఏర్పరచిన అంచనాలను అందుకుని ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో చూడాలి. కాజల్ ఇప్పటికే మరో పాన్-ఇండియన్ సీక్వెల్ మూవీ ఇండియన్-2 చేస్తోంది.

Follow on Google News Follow on Whatsapp

READ  మెగా ఫ్యాన్స్ చేసిన దానికి తిరిగి ఇచ్చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories