Homeసినిమా వార్తలుకార్తికేయ-2 విజయం తరువాత హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టిన హీరో నిఖిల్

కార్తికేయ-2 విజయం తరువాత హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టిన హీరో నిఖిల్

- Advertisement -

కార్తికేయ-2.. గత నెలలో విడుదలైన ఈ చిత్రం అనూహ్యంగా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించిన చిత్రం. నిఖిల్ సిద్ధార్థ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఆధ్యాత్మిక అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారకా నగరం శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ -అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో ఒక కీలకమైన సన్నివేశంలో కనిపించే అతిథి పాత్రలో నటించారు. శ్రీనివాస రెడ్డి- వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమా రేపిన బాక్సాఫీస్ దుమారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఎవరు కూడా ఏమాత్రం ఊహించని విధంగా బాలీవుడ్ లో సైతం ఈ సినిమా విజయ కేతనం ఎగరవేసింది. హిందీ వెర్షన్ తొలి రోజు కేవలం 50 థియేటర్లలో రిలీజ్ అయినా.. సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో థియేటర్ల సంఖ్య వేయికి, ఆ పైన రెండు వేల థియేటర్ల వరకు పాకడం విశేషం. దాన్ని బట్టే కార్తికేయ-2 హిందీ బెల్ట్ లో ఏ స్థాయిలో విజయాన్ని నమోదు చేసిందో అర్థం అవుతుంది.

అయితే హిందీ మార్కెట్లలో కార్తికేయ2 సాధించిన ఘనవిజయంతో నిఖిల్ చాలా ఉత్సాహంగా ఉన్నారు . కాగా అనుకోకుండా వచ్చిన ఈ మార్కెట్ ను కోల్పోకుండా ఉండాలని నిఖిల్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. అందుకే తన రాబోయే సినిమాలను హిందీలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. నిఖిల్ తదుపరి చేయబోయే సినిమాలు 18 పేజీస్ మరియు స్పై.

READ  Box-Office: కార్తీకేయ-2 7 డేస్ హిందీ కలెక్షన్స్

ప్రస్తుతం నిఖిల్ ఈ రెండు సినిమాల బృందంతో ఇదే విషయమై చర్చలు జరుపుతున్నారు అని తెలియవచ్చింది. ఇక పై తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించడానికి తను నటించే సినిమాల్లో అవసరమైన మార్పులను చర్చిస్తున్నారట.

అయితే హిందీ మార్కెట్ పై పట్టు సాధించడం అంత సులభం కాదనే చెప్పాలి. అక్కడ హీరో ఇమేజ్ కన్నా కూడా సినిమా కంటెంట్ పైనే ప్రేక్షకులు దృష్టి పెడతారు. మరీ ముఖ్యంగా కరోనా పాండెమిక్ తర్వాత వారు సినిమాలు చూసే విధానంలో మార్పు వచ్చింది.

కార్తికేయ-2 సినిమా అంతా కృష్ణతత్వం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ఉత్తరాది ప్రేక్షకులని ఆ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ అక్కడ కార్తికేయ-2 థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయంటే అది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అంత అనూహ్యమైన స్పందన రాబట్టే.. హిందీ డబ్బింగ్ వెర్షన్ తెలుగు చిత్రాల్లో ‘కార్తికేయ-2’ టాప్ 10 లో స్థానం దక్కించుకుంది.

నిఖిల్ తదుపరి చేయబోయే సినిమా పై కొంతవరకు ఉత్తరాది ప్రేక్షకులు దృష్టి పెడతారు అనేది అయితే వాస్తవం. ఆ చిత్రంతో గనక వాళ్ళను నిఖిల్ ఆకట్టుకోగలిగితే తను అనుకున్నట్లు నిజంగానే హిందీ మార్కెట్లో జెండా పాతేయచ్చు. మన తెలుగు హీరో హిందీలో కూడా నిలదొక్కుకుంటే అది అందరూ ఆనందించే విషయమే కదా. మరి ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న యువ హీరో నిఖిల్ ఆశలు ఫలించాలని ఆశిద్దాం.

READ  అల్లు అర్జున్ కోసం అయిదేళ్ళైనా ఎదురు చూస్తా - ఒకే ఒక జీవితం దర్శకుడు శ్రీ కార్తీక్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories