వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ లోని కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే సినీ కార్మికులు చేస్తున్న ఈ సమ్మె పై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు.కరోనా వల్ల గత కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుందని, కాస్త బాగుపడే లోగా ఇలాంటి నిర్ణయాల వల్ల మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయం పైనే ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడియోలు షేర్ చేసారు. నిన్నటి నుంచి టీవీలలో షూటింగ్ లు ఆగిపోతాయి అని ఒకటే వార్తలు మారుమోగిపోతున్నాయి అని ఆయన బాధ పడ్డారు. యూనియన్ కార్మికుల కోరికలు తీరేలా పరిశ్రమ పెద్దలు కలిసి సరైన నిర్ణయాలు తీసుకోవాలి అని,ఖచ్చితంగా తీసుకుంటారు అని ఆయన చెప్పారు.గత మూడు సంవత్సరాలుగా అన్ని పరిశ్రమల లాగే సినిమా ఇండస్ట్రీ కూడా దెబ్బతింది అని,ఆ దశలో కార్మికులు,చిన్న చిన్న ఆర్టిస్టులు తిండికి డబ్బులేక ఇబ్బందులతో పాటు వైద్యం చేయించుకోవడానికి వీలు లేక ప్రాణాలు సైతం కోల్పోయారు. పరిస్థితిలో ఈ మధ్యనే మార్పు వస్తుంది, మన తెలుగు సినిమా పరిశ్రమ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు.మనందరి దగ్గర డబ్బులు దండిగా లేకున్నా,కనీసం కడుపు నిండుతుంది కదా అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సమ్మె గురించి నిర్మాతలు,దర్శకులు ఆయనకు ఫోన్ చేశారని నరేష్ చెప్పారు.ఇప్పటికే కరోనా వల్ల నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు అని,వడ్డీలు కట్టలేని పరిస్తితి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారని,ఇలాంటి సమయంలో తొందర పడకుండా ఫెడరేషన్,నిర్మాతలు ఒక వారం లేదా పది రోజులలో కలిసి నిర్ణయానికి రావడం పెద్ద కష్టమేమీ కాదని, చివరిగా ఒక ఇండస్ట్రీ బిడ్డగా తను ఈ సమస్య పరిష్కారం కొరకు ఏం చేయడానికి అయినా సిద్ధమని, మనం దరం కలిస్తేనే ఒక కుటుంబం అని, సినీ పరిశ్రమ మళ్ళీ అంధకారం లోకి వెళ్లకుండా పెద్దలందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని నరేష్ అభిప్రాయపడ్డారు.