Homeసినిమా వార్తలుNaresh: నటుడు నరేష్, పవిత్రల వివాహం నిజమా ఒక సినిమా పబ్లిసిటీ స్టంట్ ఆ?

Naresh: నటుడు నరేష్, పవిత్రల వివాహం నిజమా ఒక సినిమా పబ్లిసిటీ స్టంట్ ఆ?

- Advertisement -

సీనియర్ నటులు నరేష్‌- పవిత్ర లోకేష్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈరోజు వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన పెళ్లి వీడియోను స్వయంగా నరేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్‌ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. అయితే వీరిద్దరూ ఎక్కడ పెళ్లి చేసుకున్నారు తదితర వివరాల గురించి ఎలాంటి స్పష్టత లేదు.

https://twitter.com/ItsActorNaresh/status/1634070240366850049?t=CY458WMyTj9d-3no3uGxLA&s=19

అందుకే నరేష్ పెళ్ళి వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఈ పెళ్లి నిజంగానే పెళ్లి జరిగిందా లేక రాబోయే ఏదైనా సినిమా యొక్క పబ్లిసిటీనా అంటూ నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా నరేష్, పవిత్రల జంట రకరకాల వివాదాస్పద సంఘటనల వల్ల వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే.

మొదట మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందన్న నరేష్ – పవిత్ర.. న్యూ ఇయర్‌ సందర్భంగా ఒక వీడియో ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం.. మీ ఆశిస్సులు కావాలి అంటూ వీడియో రిలీజ్‌ చేశారుఇక ఈరోజు పెళ్లి వీడియోతో వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన వార్తను తెలియజేశారు.

READ  Naresh: నటుడు నరేష్‌ క్యారవాన్‌ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

ఇటీవలి కాలంలో వీరిద్దరూ కలిసి పలు బహిరంగ కార్యక్రమాల్లో కనిపించడం వారి జీవితంలో అనేక వివాదాలకు దారి తీసింది. ఇప్పుడు వారు తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ఈ కొత్త జీవితం గురించి వారు ఎంతో ఉత్సాహంగా ఉండి ఉండాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories