Homeరూ. 125 కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసిన అమీర్ ఖాన్
Array

రూ. 125 కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసిన అమీర్ ఖాన్

- Advertisement -

బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ తాజాగా నటించిన సినిమా సితారే జమీన్ పర్. ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాగానే విజయవంతం అయింది. అయితే థియేటర్స్ లో బాగానే కలెక్షన్ రాబట్టిన ఈ మూవీ తాజాగా ఓటిటి రిలీజ్ కి రెడీ అయింది. అయితే ఈ మూవీకి అమెజాన్ ప్రైమ్ వారి రూ. 125 కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసారు అమీర్.

కాగా తన మూవీని ఓటిటిలో కాకుండా యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నట్లు సినిమా రిలీజ్ కి ముందే ప్రకటించారు అమీర్ ఖాన్. కాగా యూట్యూబ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరకు అనగా రూ. 100 కు ఈ మూవీ పే పర్ వ్యూ క్రింద ప్రసారం కానుంది.

అయితే ఈ ధర ఇండియాలో కాగా ఇతర దేశాలైన అమెరికా, యుకె, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆయా లోకల్ ధరలకు అందుబాటులో ప్రసారం కానుంది.

ముఖ్యంగా తన సినిమా సాధారణ ప్రేక్షకులకి కూడా అందుబాటులోకి తీసుకురావాలనే తాను ఈ విధంగా యూట్యూబ్ ద్వారా సితారే జమీన్ పర్ మూవీని అందుబాటులోకి తీసుకువస్తునంట్లు అమీర్ ఖాన్ ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. ఇక ఈ మాధ్యమం ద్వారా ఆడియన్సు నుండి మూవీకి మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు అమీర్ ఖాన్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories