Homeసినిమా వార్తలుActor Ajith Kumar Onceagain Injured మరొకసారి గాయాలపాలైన హీరో అజిత్ 

Actor Ajith Kumar Onceagain Injured మరొకసారి గాయాలపాలైన హీరో అజిత్ 

- Advertisement -

కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్ ఇటీవల విడాముయార్చి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పర్వాలేదనిపించే విజయం అందుకున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మగిళ్ తిరుమేణి తెరకెక్కించారు. తాజాగా త్రిష తో ఆయన చేస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లి. ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 

ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, తాజాగా స్పెయిన్ లోని వాలెన్సియాలో జరుగుతున్న రేస్ లలో భాగంగా అజిత్ గాయపడ్డారు. 14వ స్థానంలో నిలిచి అందరి ప్రశంసలను అందుకున్న అజిత్, 6వ రౌండ్ లో మాత్రం దురదృష్ట వశాత్తు ఇతర కార్ల కారణంగా రెండు సార్లు క్రాష్ అయ్యాడు. 

అయితే అక్కడి వీడియోలో మాత్రం అతని తప్పు కాదని స్పష్టంగా చూపిస్తుంది. అయితే క్రాష్ అయినప్పటికీ మొదటిసారి అతను తిరిగి పిట్‌లోకి దిగి రేస్ కొనసాగించారు. కాగా రెండవసారి కార్ రెండుసార్లు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 

ఆ సమయంలో ప్రమాదం నుండి అజిత్ బయటపడ్డారని, ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్లు అజిత్ మెజెనర్ సురేష్ చంద్ర తెలిపారు. వాస్తవానికి అజిత్ గతంలో దుబాయ్ లోని ఎండ్యూరెన్స్ రేస్ లో జరిగిన ప్రమాదం నుండి బయటపడ్డారు అజిత్.

ఆయన ప్రమాదం నుండి తప్పించుకోవడం ఇది రెండవ సారి ఈ ప్రమాద ఘటన విన్న అజిత్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందగా, ఫైనల్ గా ఆయనకు ఏమి కాలేదని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఆయన చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లి మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

READ  Thandel OTT Streaming Details 'తండేల్' ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories