ఏమైందీ నగరానికీ’, ‘ఫలక్‌నూమాదాస్’ చిత్రాలతో టాలీవుడ్‌లోకి దూసుకు పోతున్న యంగ్ హీరో విశ్వక్ సేన్.‘ఫలక్నూమా దాస్’ సినిమా సక్సెస్ సాధించడంతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఆ తర్వాత `హిట్` చిత్రంతో మరో సక్సెస్‌ని అందుకున్న విశ్వక్ గత ఏడాది నటించిన `పాగల్`పరాజయం పాలైనా ఏమాత్రం విశ్వాసం తగ్గకుండా తాజాగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద పర్వాలేదు అనిపించగా నటుడుగా మాత్రం విశ్వక్ కి మంచి మార్కులు పడ్డాయి.
ఇలా ఉండగా హీరో విశ్వక్ సేన్ మరో ఆసక్తికరమైన సినిమాతో రాబోతున్నాడు. కన్నడ నటుడు మరియు మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన యాక్షన్ కింగ్ అర్జున్ తో జతకడుతున్నాడు.శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్స్ బ్యానర్ పై అర్జున్ యే దీనికి కథకుడు/దర్శకుడు మరియు నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా ద్వారా హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ను తెలుగు తెరకు పరిచయం చేయనున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు.అర్జున్ గతంలోనే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు.
కేవలం నటుడిగానే కాకుండా రవయితగా,నిర్మాతగా తనకున్న అభిరుచిని మంచి యాక్షన్ థ్రిల్లర్ ల ద్వారా మరియు దేశభక్తి కథాంశంతో కూడా సినిమాలు తీసిన అర్జున్ ఇన్నేళ్ల తరువాత తెలుగులో తన కూతురును పరిచయం చేస్తూ విశ్వక్ సేన్ లాంటి యువ హీరోతో సినిమా చేయడం అనేదే విశేషం.ఇక అశోక వనంలో అర్జున కళ్యాణం తరువాత వరుస సినిమాలతో దూసుకు పోతున్న విశ్వక్ సేన్తదుపరి చేస్తున్న “గామి, అక్టోబర్ లేడీస్ నైట్,ఓరి దేవుడా (ఓహ్ మై కడవులే తమిళ చిత్రానికి రీమేక్) , దాస్ కా ధమ్కీ,ముఖ చిత్రం” సినిమాలను తొందరగా ముగించి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. వీటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా కొన్ని ఇంకా కొంత భాగం షూట్ చేయాలి. ఇదిలా ఉండగానే అర్జున్ తో సినిమా ప్రకటించారు. మరి యాక్షన్ కింగ్ మరియు యంగ్ హీరోల కలయికలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.