తమిళ స్టార్ నటుడు కార్తీ హీరోగా ఇటీవల పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సర్ధార్. మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సర్ధార్ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. కాగా దానికి సీక్వెల్ గా ప్రస్తుతం సర్ధార్ 2 రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జులై 15 నుండి షూట్ ప్రారంభం అయిన ఈ మూవీ సెట్స్ లో తాజాగా ప్రమాదం చోటు చేసుకుంది.
ఒక భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో ఎజుమలై అనే ఫైట్ మాస్టర్ దాదాపుగా 20 అడుగుల ఎత్తు నుండి క్రింద పడడంతో బాగా గాయాలవగా తక్షణమే అతడిని దగ్గర్లోనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన మృతి చెందినట్లు తెలుస్తోంది. అలానే అతడితో పాటు మరొక ఇద్దరికీ కూడా బాగా గాయాలయ్యాయట.
ప్రస్తుతం దీని పై పోలీస్ విచారణ జరుగుతోందట. దానితో సర్ధార్ 2 షూట్ ఆగిపోయింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఎస్ జె సూర్య కీలక పాత్ర చేస్తుండగా ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. కాగా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సర్ధార్ 2 టీమ్ నుండి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.