ప్రస్తుతం అన్ని దేశాల్లో మరీ ముఖ్యంగా మన దేశంలో ఓటిటి కల్చర్ ఏ విధంగా ఏ స్థాయిలో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు అయితే మనకు సినిమాలు థియేటర్స్ లో ఆ తరువాత టీవీల్లో వచ్చేవి. ఇటీవల ఓటిటిల రాకతో చాలా వరకు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని అయితే ఏకంగా అందులోనే డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి.
ఇక ఓటిటి కల్చర్ తో థియేటర్స్ అనేవి మెల్లగా కనుమరుగు అవడంతో పాటు ప్రేక్షకులు థియేటర్స్ కు రావడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. అయితే ఈ కల్చర్ కి తనవంతుగా చెక్ పెట్టేందుకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తొలిసారిగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై తన నుండి నుండి వచ్చే సినిమాలు అన్ని కూడా థియేటర్స్ లో తప్ప ఓటిటిలో ఏమాత్రం అందుబాటులోకి రావని అలానే వాటికి ఓటిటి డీల్స్ ని స్టాప్ చేసారు అమీర్ ఖాన్. గతంలో మాదిరిగా ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించి ఇకపై సినిమాలు గత వైభవాన్ని అందుకునేలా ఆయన తీసుకున్న నిర్ణయం ఇకపై ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో, అలానే ఇతర నటీనటులు ఎలా స్పందించి నిర్ణయిస్తారో చూడాలి.