‘ఎన్టీఆర్ 30’ తర్వాత ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ ను నటింపజేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తను నటించిన చివరి చిత్రం లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద పని భారీ పరాజయం పాలవడంతో ఆయన కెరీర్ కు గట్టి దెబ్బ తగిలింది. అయితే తన నటనా ప్రతిభను మరోసారి ప్రదర్శించాలని ఆయన సినిమాల్లోకి జంప్ చేయాలని భావిస్తున్నారు.
అందుకు ఈసారి ఓ టాలీవుడ్ సినిమాని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్31వ చిత్రంలో ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ విలన్ గా నటించనున్నట్లు సమాచారం. అంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి అమీర్ స్క్రీన్ స్పేస్ పంచుకోనున్నారన్నమాట.
ఎన్టీఆర్31 సినిమా కోసం ఆమిర్ ఖాన్ ని నటింపజేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. ఈ చిత్ర నిర్మాతలు విలన్ పాత్ర కోసం అమీర్ ను సంప్రదించినప్పటికీ, బాలీవుడ్ స్టార్ ఇంకా దీనికి ఒప్పుకున్నారా లేదా తెలియలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్31 ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆమీర్ ఖాన్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆయన ఎన్టీఆర్31 లో నటించనున్నారు అనే వార్తలు గనక నిజం అవుతే ఇది ఇండియన్ సినిమాలో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.