Homeసినిమా వార్తలునా పై, నా కుటుంబం పై ట్రోలింగ్ చేయిస్తుంది ఒక ప్రముఖ హీరో : మంచు...

నా పై, నా కుటుంబం పై ట్రోలింగ్ చేయిస్తుంది ఒక ప్రముఖ హీరో : మంచు విష్ణు

- Advertisement -

తెలుగు సినీ నటుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరిగిన సందర్భంగా తన పై దారుణంగా ట్రోల్స్ చేశారని ఆయన అన్నారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేశారని తీవ్రంగా ఆవేశాన్ని వెళ్లగక్కారు. అయితే ఈ ట్రోల్స్ వెనకాల ఒక స్టార్ హీరో ఉన్నారని మంచు విష్ణు ఆరోపించడం గమనార్హం. కేవలం తన కుటుంబం పై ట్రోల్స్ చేసేందుకు ఏకంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించడం జరిగిందని ఆయన అన్నారు.

మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా. ఆ చిత్రం తాలూకు ప్రచార కార్యక్రమాలలో బాగంగా విష్ణు.. ‘మా’ ఎన్నికల సంఘటన జరిగినప్పటి నుంచి మా కుటుంబం పై ట్రోల్స్ ఎక్కువయ్యాయని వాపోయారు. అంతే కాకుండా తనని, తన కుటుంబాన్ని ట్రోల్స్ చేయడమే కాక తిట్టారని.. అలా చేసిన వారి పై సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు విష్ణు తెలిపారు.

ఇన్ని రోజులు ఈ ట్రోల్స్ దాడులను భరించానని, కానీ ఇక పై మాత్రం సహించేది లేదని ఈ క్రమంలో అలా చేస్తున్న వారికి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. తన పై ట్రోల్స్ చేయడానికి 18 యూట్యూబ్ ఛానళ్ళు పని చేస్తున్నాయని, అవన్నీ మూత పడేలా చేస్తానని హెచ్చరించారు.

READ  కార్తికేయ-2 విజయం నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం - అభిషేక్ అగ‌ర్వాల్

ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన సన్నీలియోన్ మరియు పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. ఐతే, తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. మొదట అక్టోబర్ 5, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, తాజాగా అక్టోబర్ 21, 2022కి ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని పుకార్లు రాగా.. ఇదే విషయం పై మంచు విష్ణు ను ప్రశ్నించగా, దసరా అయినా దీపావళి అయినా ఖచ్చితంగా అక్టోబరులోనే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

కాగా ఓ ప్రముఖ స్టార్ హీరోకి చెందిన కంపెనీ నుంచే తన కుటుంబం పై ట్రోలింగ్ జరుగుతుందని మంచు విష్ణు అన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఒక కంపెనీలో కేవలం త‌న కుటుంబం పై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నట్లు చెప్పడం అందరినీ విస్మయపరిచింది. ఆ ఆఫీస్ చిరునామాతో పాటు ఐపీ అడ్రస్‌ల‌ను కూడా సేక‌రించానని విష్ణు చెప్పారు.

READ  ప్రభాస్ పనితీరు మెచ్చని ప్రశాంత్ నీల్

త్వ‌ర‌లోనే తన ఆరోపణలకు సంబంధించిన సమగ్ర ఆధారాలను, ఐపీ అడ్రస్‌లతో సహా పోలీసులకు అందజేస్తానని మంచు విష్ణు వెల్లడించారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories