Homeసినిమా వార్తలుThalapathy67: విజయ్- లోకేష్ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్

Thalapathy67: విజయ్- లోకేష్ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్

- Advertisement -

విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి (Thalapathy67) ఇటీవలే భారీ తారాగణాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ సరసన త్రిష నటించనున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంజయ్ దత్ దర్శకులు గౌతమ్ మీనన్, మిస్కిన్ తదితరులు నటిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ఎల్సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) ను ముందుకు తీసుకెళ్తుందని అందరూ ఊహించగా, తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఈ చిత్రం ఒక స్టాండ్ ఎలోన్ చిత్రం అని, ఖైదీ మాదిరిగానే తనదైన మరో యూనివర్స్ కు ప్రారంభించే మార్గంలో ఉందని అంటున్నారు. ఆ రకంగా లోకేష్ కనగరాజ్ మరో కొత్త యూనివర్స్ ప్లాన్ చేస్తుండగా, దళపతి 67 అందులో భాగం కాబోతోంది.

‘తుపాకి’, ‘బీస్ట్’ చిత్రాల తర్వాత మూడోసారి విజయ్ సినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా, ‘మాస్టర్’ లాగే మరోసారి తమను అలరిస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

READ  Varisu Review: వారిసు మూవీ రివ్యూ: రొటీన్ కథే అయినా అలరించే అంశాలు ఉన్న ఎంటర్టైనర్

ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత కార్తీతో ఖైదీ 2 సినిమాని ప్రారంభించనున్నారు. కాగా ఈ చిత్రంలో లోకేష్ ఢిల్లీ పాత్ర, అతని మూలాలు ఎక్కడ మొదలయ్యాయి అనే అంశాలను చూపిస్తారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories