తెలుగు సినిమా పరిశ్రమలో సాధారణంగా హీరోయిన్ ల కొరత ఎపుడ ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు అయితే చాలా తక్కువ. అలాంటి అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్ లలో ఒకరు చాందిని చౌదరి.
యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న చాందినికి ఆ తరువాత కలర్ ఫోటో చిత్రం ద్వారా బ్రేక్ లభించింది. అందులో ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె కిరణ్ అబ్బవరం తో జోడీగా “సమ్మతమే” చిత్రంలో నటిస్తుంది. వచ్చే వారం అంటే జూన్ 24న ఆ సినిమా విడుదల అవ్వబోతుంది.
ప్రచార కార్యక్రమాలలో భాగంగా కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం కి వచ్చినపుడు ఆలీ చాందినీ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ఒక ప్రొడ్యూసర్ కావాలని చాందినీతో సినిమా తీయకుండా, అదే సమయంలో మరే ఇతర సినిమాలో తను నటించకుండా బ్లాక్ మెయిల్ చేసిన ఉదంతం బయట పడింది.
సదరు ప్రొడ్యూసర్ తనని, తన కుటుంబాన్నీ కనిపించకుండా చేస్తాను అని బెదిరించినట్లుగా చాందినీ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో చాలా భయపడిన విషయం కూడా చెప్పింది. అయితే ఇంత పెద్ద సమస్య వచ్చినపుడు ఎందుకని ఇతర ఇండస్ట్రీ పెద్దలను సంప్రదించలేదు అని ఆలీ అడగగా, ఆ సమయంలో ఎవరి దగ్గరకెళ్ళి ఏం చెప్పుకోవాలో తెలియలేదు అని, తనను తాను సమర్డించుకోడానికి తన దగ్గర సరైన ఆధారాలు లేకపోయాయి అని చాందినీ వివరించింది. చివరికి ఆ ప్రొడ్యూసర్ దగ్గరున్న కాంట్రాక్ట్ చెల్లదు అని తెలిసిన తరువాత విషయం ఒక కొలిక్కి వచ్చిందట.
ఇండస్ట్రీలో రంగుల ప్రపంచంతో పాటు ఇలాంటి చెడు సంఘటనలను జరుగుతూనే ఉంటాయి. గతంలో కూడా చాలా మంది హీరోయిన్ లు లైంగికంగా, మరో రకంగా భాదింపబడ్డారు. అన్ని సమస్యలను ఎదుర్కుని నిలబడటం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటేనే ఇండస్ట్రీకి మంచిది.