Homeసినిమా వార్తలుత్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమా

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమా

- Advertisement -

మన భారతీయ పురాణాలతో పాటు గొప్ప చరిత్ర పట్ల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా ఆసక్తి చూపుతారు అని అందరికీ తెలిసిందే. హిందూ పురాణాలు మరియు పాత్రల గురించి ఆయన తన సినిమాలలో అనేక సార్లు ప్రత్యక్షంగా చెప్పడం లేదా పరోక్షంగా అవి గుర్తొచ్చెలా సన్నివేశాలు మరియు డైలాగులు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇటువంటి సబ్జెక్ట్‌ తో సినిమా చేసేందుకు ఆయన ఆసక్తి చూపారు. అయితే, వివిధ కారణాల వల్ల, ఆయన కేవలం మాటల్లోనే తప్ప తెరమీద అలాంటి సినిమా ఇంతవరకు తీయలేదు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆ సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎట్టకేలకు తనకు ఇష్టమైన జానర్ లో ఒక భారీ బడ్జెట్ చిత్రం మొదలుపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం పై అధికారిక సమాచారం ఇంకా అందుబాటులో రానప్పటికీ, కన్నడ నటుడు ఉపేంద్ర తన తదుపరి చిత్రం అయిన ప్యాన్- ఇండియా భారీ సినిమా కబ్జా టీజర్ విడుదల కార్యక్రమంలో ఈ భారీ చిత్రం తాలూకు సమాచారాన్ని అందించారు.

కన్నడ స్టార్లు ఉపేంద్ర – సుదీప్ ల కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా “కబ్జా. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను నిన్న విడుదల చేశారు. రానా కూడా హాజరైన టీజర్ ఈవెంట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ, త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘హిరణ్యకశ్యప’ సినిమా వల్ల వచ్చే రెండేళ్లు కూడా రానా చాలా బిజీగా ఉంటారని అన్నారు. ఆ సమయంలో రానా ఈ సినిమా ఉందని చెప్పలేదు అలాగని లేదనీ చెప్పలేదు. గత కొన్ని రోజులుగా ఇదే విషయం మీద మీడియాలో వార్తలు బాగానే వచ్చాయి. అందువల్ల ఈ తాజా వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలకు, సినీ ప్రేమికులకు భారీ ఉత్సాహాన్ని ఇచ్చింది.

READ  దర్శకుల కెరీర్ తో ఆడుకుంటున్న రామ్ చరణ్ - ఎన్టీఆర్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తన తదుపరి సినిమా తాలూకు షూటింగ్ ఇటీవలే ప్రారంభించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2023లో విడుదల కానుంది. దీని తర్వాత ఈ మాటల మాంత్రికుడు ‘హిరణ్యకశ్యప’ సినిమాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories