పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సుజీత్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా మేకర్స్ ఇన్నాళ్లూ OG ప్రమోట్ చేశారు. కాగా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పుడు ఈ సినిమా గురించి అదే అంతర్గత వర్గాల నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఓజీ సినిమా కోసం మొదటి షెడ్యూల్ ను చాలా సుదీర్ఘమైన విధంగా ప్లాన్ చేశారని, ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలోని ప్రధాన తారాగణం కూడా పాల్గొంటుందని అంటున్నారు. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ వంటి 5 ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు ఓజీ టైటిల్ కరెక్ట్ గా సరిపోతుందని భావించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వర్ధమాన దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది. ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ సినిమాను అనౌన్స్ చేయగా, సుజీత్ రచనతో పాటు దర్శకత్వం వహిస్తారని నిర్మాతలు ప్రకటించారు.
టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ / గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారని అంటున్నారు. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ ల విక్రమ్ తరహాలో ఈ సినిమా కథనం ఉంటుందని, ఇందులో హీరోకు స్క్రీన్ టైమ్ తక్కువే అయినా తెర పై జరిగే సంఘటనలన్నీ ఆయన చుట్టూనే ఉంటాయని అంటున్నారు.ఇక ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ నిర్మాతల ప్లాన్ ప్రకారమే జరుగుతుందని ఆశిద్దాం.