తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఆడియన్స్ ముందుకు పలు సినిమాలు రావడం జరిగింది. వాటిలో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ అలానే కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ నటించిన అమరన్ తో పాటు మన టాలీవుడ్ యువనటుడు కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ తో పాటు అటు కన్నడలో భగీర మూవీ, హిందీలో సింగం ఎగైన్, భూల్ బులయ్య 3 మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి.
ముఖ్యంగా వీటిలో లక్కీ భాస్కర్ మూవీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని ఫస్ట్ డే నుంచి విశేషమైన రెస్పాన్స్, కలెక్షన్ తో బాక్సాఫీస్ వద్ద సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటికే రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్ సంపాదించింది. మరోవైపు శివ కార్తికేయన్ నటించిన అమరన్ కూడా రూ. 20 కోట్ల కలెక్షన్ తో కొనసాగుతోంది.
ఇక అటు హిందీలో రిలీజ్ అయిన సింగం ఎగైన్, బూల్ బులయ్య 3 కూడా మంచి కలెక్షన్ అందుకుంటూ కొనసాగుతున్నాయి. మొత్తంగా ఇవన్ని కలిపి రూ. 75 కోట్ల కు పైగా కలెక్షన్ దక్కించుకున్నాయి. మరి ఫైనల్ గా వీటిలో ఏది ఏ స్థాయి కలెక్షన్ అందుకుని ఎంతమేర ఆడియన్స్ మెప్పిస్తుందో తెలియాలంటే మరి కొన్నాళ్ల వరకు వెయిట్ చేయక తప్పదు.