Homeసినిమా వార్తలుMahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాకు 300 కోట్ల ప్రీ...

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాకు 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో 12 ఏళ్ల గ్యాప్ తర్వాత ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రస్తుతానికి SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానుల్లో క్రేజ్ రావడమే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ హైప్ ఉంది.

కాబట్టి ఈ కాంబోలో వచ్చే సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ తో కూడా అద్భుతాలు చేయడం సహజం. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను రికార్డు ధరకు కొనుగోలు చేయగా, ఈ సినిమా శాటిలైట్, డబ్బింగ్, మ్యూజిక్ రైట్స్ కు కూడా రికార్డు స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.

కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే ఈ సినిమా 150 కోట్ల బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇక థియేట్రికల్ రైట్స్ కోసం అన్ని ఏరియాల్లో నాన్ రాజమౌళి స్థాయి రికార్డ్ షేర్స్ కోట్ చేస్తున్నారని అంటున్నారు.

READ  Akkineni Heroes: బాలకృష్ణ వ్యాఖ్యల పై అక్కినేని హీరోల కౌంటర్

ఓవరాల్ గా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల బిజినెస్ 150 కోట్లు కాగా, ఎంత లేదన్నా 130 కోట్ల బిజినెస్ చేస్తుందని, ఓవర్సీస్ లో మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరూ బిగ్గెస్ట్ స్టార్స్ కావడంతో ఈ సినిమా అక్కడ హాట్ కేక్ అని అంటున్నారు. థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఖచ్చితంగా 160 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

కాబట్టి థియేట్రికల్స్, నాన్ థియేట్రికల్స్ నుంచి వచ్చే మొత్తాలను కలిపితే మహేష్ – త్రివిక్రమ్ సినిమా ఈజీగా 300 కోట్ల బిజినెస్ చేయొచ్చు. ఒక నాన్ పాన్ ఇండియన్ సినిమాకు ఇది భారీ సంఖ్య అనే చెప్పాలి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న హైప్ కి తగ్గట్లుగా ఈ సినిమా ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అందించాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  Sankranthi 2024: 2024 సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడానికి ఎన్టీఆర్ మినహా మిగతా స్టార్స్ ప్లాన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories