సినిమా పేరు: 23 (ఇరవై మూడు)
రేటింగ్: 2.5 / 5
నటీనటులు: తేజ ఆర్, తన్మయి ఖుషి, ఝాన్సీ, తాగుబోతు రమేష్, తదితరులు
దర్శకుడు: రాజ్ ఆర్
నిర్మాత: స్పిరిట్ మీడియా, స్టూడియో 99 ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 16 మే 2025
మల్లేశం ఫేమ్ రాజ్ ఆర్ తాజాగా 23 మూవీ ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చారు. ఈ మూవీని స్టూడియో 99, స్పిరిట్ మీడియా సంస్థల పై రాజ్ రాచకొండ గ్రాండ్ గా నిర్మించారు. మరి ఈ థ్రిల్లర్ మూవీ నేడు ఆడియన్సు ముందుకి వచ్చి ఎంతమేర వారిని మెప్పించింది అనేది ఇప్పుడు ఫుల్ రివ్యూలో చూద్దాం.
కథ :
ఈ మూవీ 1993లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నేపథ్యంలో సాగుతుంది. సాగర్ (తేజ ఆర్) తన ప్రేయసి సుశీల (తన్మయి ఖుషి)తో కలిసి ప్రశాంతంగా జీవించాలని భావిస్తాడు. అయితే అధిక ధనాశ వలన త్వరగా డబ్బు సంపాదించాలని ఒక డేంజరస్ మార్గాన్ని ఎంచుకుంటాడు. దాని వలన ఒక బస్సు నిప్పంటుకుని అందులోని 23 మంది యొక్క మరణానికి అతడు కారణంగా నిలుస్తాడు.
అనంతరం ఆ ఘటనకి సంబంధించి జైలు పాలైన సాగర్, అపరాధ భారంతో విముక్తిని కోరుకుంటాడు. మరి అతడి తదుపరి పరిస్థితి ఏమిటి, కాలం అతడికి రెండవ అవకాశం ఇచ్చిందా, అతడు మంచి మనిషిగా మారాడా లేదా అనేది మొత్తం కూడా సినిమా తెరపై చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
నటుడు తేజ కేవలం పర్వాలేదనిపించేలా యాక్ట్ చేసాడు అంతే. పెర్ఫార్మన్స్ కి ఎంతో స్కోప్ ఉన్న ఆ పాత్రలో అతడు తేలిపోయాడు, పలు కీలక సీన్స్ లో ఆకట్టుకోలేదు. హీరోయిన్ తన్మయి ఖుషి బాగానే తన అందం, అభినయంతో మెప్పించింది. పవన్ రమేష్, తాగుబోతు రమేష్ మరియు ప్రణీత్ ఆకట్టుకున్నారు. ఝాన్సీ చిన్న పాత్రలో సహజంగా నటించింది.
విశ్లేషణ :
మల్లేశం తో పాటు 8 ఏఎం మెట్రో సినిమాలు తీసిన దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కించిన ఈ 23 మూవీ సోషల్ మెసేజ్ తో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందింది.
చాలా వరకు సినిమాని ఆడియన్స్ ని అలరించేలా అతడు తెరకెక్కించాడు. సుండురు దళితుల ఘటన, చిలకలూరిపేట అగ్ని ప్రమాద ఘటన, జుబిలీ హిల్స్ కార్ బాంబు బ్లాస్ట్ ఘటనలు లింక్ చేస్తూ కులం మరియు అధికారం ఆధారంగా న్యాయం అసమానతలను ధైర్యంగా చూపించడం వంటివి సినిమాకి మంచి డెప్త్ ని అందించాయి.
మెసేజ్ బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తేలిపోతుంది. ప్రధాన పాత్రల మధ్య జరిగే కొన్ని కీలక సీన్స్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించేవిగా అనిపించవు. ఇక సినిమా యొక్క రెండు భాగాలలో వివిధ వర్గాల, సంఘాల ప్రజలకు న్యాయం విభిన్నంగా ఎలా జరుగుతుందనే అంశాలు బాగున్నా, ఆ సీన్స్ తెరపై చూసేటప్పుడు అంత ఇంప్యాక్ట్ ఫుల్ గా లేవు.
ప్లస్ పాయింట్స్ :
- ప్రధాన పాయింట్
- న్యాయ వ్యవస్థ గురించి ఆసక్తికరమైన సన్నివేశాలు / సంభాషణలు
- హీరో హీరోయిన్ మధ్య కొన్ని సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
- ఆకట్టుకోని కథనం / స్క్రీన్‌ప్లే
- కొన్నిసార్లు నీరసమైన కథనం
- సరైన భావోద్వేగ సంబంధం లేకపోవడం
తీర్పు :
మొత్తంగా రాజ్ ఆర్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 23 యొక్క ప్రధాన పాయింట్, సోషల్ మెసేజ్ వంటివి బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా మెప్పించదు. కొన్ని ప్రధాన సీన్స్ అంతగా ఆకట్టుకోవు, అవి కథనం మీద ఆసక్తిని ఏమాత్రం పెంచవు. మంచి రియలిస్టిక్ అంశాలతో సోషల్ మెసేజ్ సినిమాలు కోరుకునే వారికి మాత్రం ఈ మూవీ నచుతుంది.