2022 సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబుకి అత్యంత కష్టతరమైన సంవత్సరంగా గడిచింది. ఒకే సంవత్సరంలో కుటుంబంలోని ముగ్గురు ఆప్తులను కోల్పోయి ఆయన చాలా కష్ట సమయాలను ఎదుర్కొంటున్నారు. ఆయనకు ధైర్యాన్ని, శక్తిని అందించాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
మహేష్ బాబు తన సోదరుడితో లోతైన భావోద్వేగ అనుబంధం ఉన్న కుటుంబ వ్యక్తిగా పేరు పొందారు. సూపర్‌స్టార్ కృష్ణ తన సోదరుడు ఆది శేషగిరిరావుతో ఎంతగా ఆప్యాయంగా ఉండేవారో, ఈ తరం సూపర్ స్టార్ మహేష్ తన సోదరుడు రమేష్ బాబుతో కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు.
అనారోగ్య కారణాల వల్ల రమేష్‌బాబు ఈ ఏడాది జనవరిలో కన్నుమూశారు. దీంతో మహేష్, ఘట్టమనేని అభిమానులు షాక్‌కు గురయ్యారు. రమేష్ బాబు 56 సంవత్సరాల వయస్సులో మరణించాడు. మహేష్ కు ఆయన కేవలం సోదరుడి స్థానంలో కాక తండ్రిలా ఉండేవారని ప్రతీతి.
ఇక ఆ భాద లోంచి మహేష్ కోలుకునే లోపే మరో ఆయన తల్లి ఇందిరా దేవి గారి మరణంతో కుటుంబంలో రెండవ నష్టాన్ని ఒకే సంవత్సరంలో చూడాల్సి వచ్చింది. మహేష్ తో ఆయన తల్లికి, అభిమానులకు, తెలుగు సినీ వర్గాలకు ఎంతగా అనుబంధం ఉందో మనందరికీ తెలిసిందే.
సూపర్‌స్టార్ కృష్ణ తన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునే ఫిట్‌మెన్‌గా పేరు పొందారు. ఇక ఆయన వ్యక్తిగత వైద్యుల నివేదికల ప్రకారం, కృష్ణ గారు గత వారంలో కూడా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిసింది.
అయితే, ఎవరూ ఊహించని విధంగా పరిస్థితులు చాలా త్వరగా తలకిందులయ్యాయి. ఏడాది వ్యవధిలో కుటుంబంలో మూడో అకాల మరణంగా ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు కన్నుమూశారు. ఈ ఘోరమైన దుఖ సమయంలో ఘట్టమనేని కుటుంబానికి సన్నిహితులు ఇప్పుడు మహేష్ మరియు కుటుంబాన్ని ఓదార్చుతున్నారు.
ఇతరులు ఎంత మద్దతుతో పాటుగా ప్రేమను చూపించినా, రక్త సంబందీకులని కోల్పోయిన బాధ లోంచి తెలుకోవడం చాలా కష్టం. మహేష్ తన తండ్రిని ఎంతగా ప్రేమిస్తారో.. ఆయనని ఒక దేవుడిగా మరియు ప్రేరణగా భావిస్తారో అందరికీ తెలిసిందే. దురదృష్టవశాత్తూ, ఈరోజు ఒక గొప్ప కొడుకు గొప్ప తండ్రిని కోల్పోయాడు.