Homeసినిమా వార్తలు200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సూర్య - సిరుతై శివ సినిమా

200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సూర్య – సిరుతై శివ సినిమా

- Advertisement -

తమిళ స్టార్ సూర్య – దర్శకుడు శివల కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్ట్ ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో సందడి చేస్తోంది. ఈ సినిమా అటు దర్శకుడు శివతో పాటు సూర్యకు కూడా చాలా కీలకం. శివ ఇటివలే “అన్నత్తె” (తెలుగులో పెద్దన్న) సినిమాతో భారీ డిజాస్టర్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. అలాగే హీరో సూర్య కూడా బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ లేక తన స్టార్డం పై అనుమానాలు వచ్చే దశలో ఉన్నారు.

సూర్య ఇటీవల జై భీమ్, సూరరై పొట్రు చిత్రాలలో తన నటనకు చక్కని ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకుండా, “సూరరై పొట్రు” చిత్రానికి గానూ సూర్య ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. “తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్” సినిమాలో నటనకు అజయ్ దేవగణ్ తో కలిసి సూర్య ఈ గౌరవాన్ని పంచుకున్నారు.

అయితే, నటన విషయంలో సూర్య ప్రతిభను ఎప్పుడూ తక్కువ చేసే అవకాశం ఆయన ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం ఆయనకు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక భారీ కమర్షియల్ సక్సెస్ ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి ఉంది. అయన చివరిగా హీరోగా నటించిన ET సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అందరూ ఆశించారు కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అలాంటి సమయంలో సూర్య – శివ కలిసి ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు.

READ  మళ్ళీ రిపీట్ కానున్న మ్యాజికల్ కాంబినేషన్

కాగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని, మరియు అన్ని భాషలలో 3D వెర్షన్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇది కేవలం సినిమా ప్రారంభ దశలోనే ఉన్న వార్త.

ఇక ఈ సినిమా ఫైనల్ బడ్జెట్ మరియు బిజినెస్ ఎంత వరకు అవుతుందో చూడాలి. ప్రస్తుతం ప్రేక్షకులకి చాలా సాంకేతిక విప్లవం అందుబాటులో ఉంది. మరి వారిని ఆకట్టుకోవాలి అంటే చిత్ర బృందం సంచలనాన్ని సృష్టించే, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో ముందుకు రావాలి.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని గట్టిగా చెబుతున్నారు. ఇక ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది . దిశా పటానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారనే వార్తను దాదాపు ఖరారు చేసుకోవచ్చు.

స్టూడియో గ్రీన్ మరియు UV క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సూర్య 42వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. కాగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

READ  దిల్ రాజును చుట్టుముడుతున్న సమస్యలు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories