అడివి శేష్ హీరోగా నటించి, సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమా చక్కని ప్రశంస లతో పాటు కలెక్షన్ లు కూడా రాబట్టుకుంటుంది.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. అటు మేజర్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల తో పాటు సినిమాకి అవసరమైన నాటకీయత కూడా జోడించి అందరినీ మెప్పించింది మేజర్ టీమ్.
తెలుగుతో పాటు హిందీ లోనూ విడుదల అయినా మేజర్ అక్కడ కూడా బాగానే కలెక్షన్ లు రాబట్టినా, సరైన విధంగా ప్రచారం చేసి ఉంటే మరింత ఎక్కువ ప్రేక్షకులకి చేరుకునేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడ్డాయి.
అయితే మొత్తంగా 50 కోట్ల వరకూ గ్రాస్ కలెక్ట్ చేసిన మేజర్ చిత్రం ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల వరకూ వస్తే రెండు వారాల్లో 23 కోట్ల షేర్ సాధించి అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
మొత్తానికి విమర్శకుల నుంచి అభినందనల తో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన మేజర్ చిత్రం ఈ సంవత్సరంలో మన తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి వెలువడ్డ అతి తక్కువ హిట్స్ లో ఒకటి. ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయితే మరిన్ని కొత్త ప్రయత్నాలు చేయడానికి నవతరం దర్శకులు ముందుకు వస్తారు.