రామ్ చరణ్.. శంకర్ ల కాంబినేషన్లో సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో లాంచనంగా ప్రారంభం అయ్యింది. ఇక ఈ ప్రాజెక్టు (RC-15) అనౌన్స్ అయిన రోజు నుండి అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలలో కూడా భారీ క్రేజ్ ను సృష్టించడంలో విజయవంతం అయింది. టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ నుండి మహమహులు హాజరైన భారీ పూజా కార్యక్రమం తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. అప్పటి నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతూనే ఉంది.
ఇప్పటికే పూణె, అమృత్‌సర్, తూర్పు గోదావరిలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని మేజర్ షెడ్యూల్స్ చిత్రీకరించారు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం, శంకర్ హైదరాబాద్ లోని శంషాబాద్‌లో 12 కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్ ను వేసి అందులో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
అంతే కాక ఈ షెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్ కూడా భాగం అవుతారట. ఈ సినిమాని కేవలం ప్రేక్షకులకు కాక పరిశ్రమలకు అతీతంగా అందరూ చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలకి ఒకటి, ఇక శంకర్ ఈ చిత్రంలో తన శైలికి అనుగుణంగా భారీ సెట్ డిజైన్‌లు మరియు విలాసవంతమైన షూటింగ్ షెడ్యూల్స్ ఇలా ఎక్కడా ఎటువంటి ఖర్చులకి వెనుకాడటం లేదు.
ఇప్పటికే హీరోయిన్ కియారా అద్వానీ నటించిన ఒక పాటను భారీ సెట్‌లో చిత్రీకరించారు. సోషల్ డ్రామా రూపంలో సమాజంలోని పరిస్థితులను చక్కగా చూసిస్తూ.. ఫైట్లు మరియు పాటలను భారీ స్థాయిలో విజువల్స్ తో తెరకెక్కించటంలో శంకర్ తనదైన ముద్ర వేశారు. ఇక RC-15 సినిమా చిత్రీకరణ జరుగుతున్న తీరు, ఆ సినిమా గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే. శంకర్ ఈ సినిమాతో తన బలమైన దారిలోకి తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా, ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్టార్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు.
ఈ యాక్షన్ డ్రామాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తుండగా, దిల్ రాజు నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌కి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు.
ఇక రామ్ చరణ్ – శంకర్ ల సినిమా కథ విజయానికి వస్తే.. ఈ చిత్రం ఒక పవర్ ఫుల్ మెసేజ్ తో కూడిన పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. అవినీతిని నిర్మూలించే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సోషల్ డ్రామాలో రామ్ చరణ్ పాత్ర అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తిగా కనిపించనున్నారు. అలాగే ఆయన ఒక ఐఎస్ అధికారి పాత్రను పోషిస్తున్నారని కూడా అంటున్నారు. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, శంకర్ సినిమాలలో సాధారణంగా కనిపించే భారీ విఎఫ్ఎక్స్ దృశ్యాలు, ఖరీదైన సెట్లు RC15లో కనిపించవట.