Homeసినిమా వార్తలుJai Bhim: హీరో సూర్య పై కేసు కొట్టివేసిన మద్రాస్ హై కోర్టు

Jai Bhim: హీరో సూర్య పై కేసు కొట్టివేసిన మద్రాస్ హై కోర్టు

- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్. గత ఏడాది అమెజాన్ లో నేరుగా ఓటీటీ రిలీజ్ గా వచ్చిన ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. కేవలం సూర్య అభిమానులనే కాదు భాషలకు అతీతంగా ప్రేక్షకులను మెప్పించింది. గిరిజ‌నుల‌కు అండ‌గా నిలుచున్న లాయ‌ర్ చంద్రు పాత్ర‌లో హీరో సూర్య న‌టించారు. న‌టుడి గానే కాదు నిర్మాత‌గానూ ఆయ‌న ఎప్పుడూ కొత్త కథలను, సినిమాలని ప్రోత్సహిస్తూ ఉంటారు.

ఆ కోవలోనే 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జై భీమ్‌’ సినిమాను రూపొందించారు. పోలీసులు, కేసులు, అంటూ సాగే ఈ సినిమా సామాజిక అస‌మాన‌త‌లు, ఒక వ‌ర్గాన్ని మ‌రో వ‌ర్గం త‌క్కువ‌గా చూడటం అనే అంశాల నేపథ్యంలో రూపొందించబడింది. రాజ్యాంగం కల్పించిన హ‌క్కులు అంద‌రికీ అందుబాటులో ఉండ‌టం లేదనే అంశంతో, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా జై భీమ్. అయితే ఈ సినిమాకు ఎన్నో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

ఆ విమర్శల్లో భాగంగానే హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక పై గతంలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. జై భీమ్ సినిమాలో తమ కులాన్ని, మతాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి అంటూ కోర్ట్ ని ఆశ్రయించారు రుద్ర వన్నియార్ కుల చత్రియార్ సంఘం అధ్యక్షుడు సంతోష్ నాయక్. సినీ నిర్మాతలు, హీరో సూర్య, నటి జ్యోతికపై సంతోష్ నాయక్ సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ వెంటనే ఇరువురి పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

READ  OTT రిలీజ్ పై కొత్త నిబంధనలు అమలు లోకి తెస్తున్న తెలుగు సినిమా నిర్మాతల మండలి

అయితే ఈ కేసు విషయంలో సూర్యనే గెలిచారు.సూర్య – జ్యోతిక పై పెట్టిన కేసును మద్రాసు హై కోర్టు కొట్టివేసింది. హీరో సూర్య పై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదని ఈ మేరకు హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు ఖచ్చితంగా హీరో సూర్యకు, ఆయన అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  పవన్ ను ఒప్పించడానికి హరీష్ శంకర్ మరో ప్రయత్నం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories