పిల్ల నువ్వు లేని జీవితం తో మెగా హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్ . సుబ్రమణ్యం ఫర్ సెల్, సుప్రీమ్ వరుస సక్సెస్ మూవీస్ తో తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. చిత్రాలహరి వంటి సక్సెస్ తర్వాత మారుతీ దర్శకత్వంలో నటించిన ‘ప్రతిరోజు పండగే’ చిత్రంతో మన ముందుకి వస్తున్నాడు. రాశీఖన్నా కథానాయిక. సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాయిధరమ్‌తేజ్ ట్రాక్ టాలీవుడ్ టీం తో ముచ్చటించారు విశేషాలు…