Homeసినిమా వార్తలురామారావు అన్ డ్యూటీ ట్రైలర్: సీరియస్ రోల్ లో రవితేజ

రామారావు అన్ డ్యూటీ ట్రైలర్: సీరియస్ రోల్ లో రవితేజ

- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ .. వయసు పైబడుతున్నా, వరుస సినిమాలతో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఏకబిగిన సినిమా చేయడమే పనిగా పెట్టుకున్నారు . ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఉన్న రవితేజ.. తాజాగా నటించిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు చిత్ర బృందం. ఇందులో భాగంగా ఒక్కో అప్‌డేట్ వదులుతూ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను జులై 16న విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపారు.

ఇక ఈరోజు కాస్త ఆలస్యంగా విడుదలైంది ట్రైలర్. ట్రైలర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే రవితేజ ఈ సినిమాలో డిప్యూటీ కలెక్టర్ గా కనిపించటం విశేషం. తప్పిపోయిన కొందరు వ్యక్తులను వెతకడం ఆయన బాధ్యతగా తీసుకున్నట్లు అర్థం అవుతుంది. మొదట్లో కాస్త సాత్వికంగా ఉండి.. ఆ తరువాత దూకుడుగా మారే హీరో పాత్రలో రవితేజ కనిపిస్తున్నారు. అలాగే ట్రైలర్ లో ఒకప్పటి హీరో వేణు కూడా కనిపించారు. అయితే మాస్ మహారాజ్ నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ ఈ ట్రైలర్ లో అసలు కనపడక పోవటం గమనార్హం.

READ  కొత్త లుక్ లో ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన రష్మిక

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్స్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూలై 29న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తర్వాత ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ లకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories