Homeసినిమా వార్తలుసీతా రామం ఒక క్లాసిక్ అంటున్న సుమంత్

సీతా రామం ఒక క్లాసిక్ అంటున్న సుమంత్

- Advertisement -

దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతీ మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకం పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లోనే కాదు ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న రష్మిక మందన కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం.


అంతే కాదు బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ కూడా ఓ ప్రాముఖ్యమైన పాత్రలో కనిపించ బోతున్నారు. ఈ చిత్రంలో ఆయన లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అవ్వడం, దానికి ప్రేక్షకుల నుంచి భలే ఆసక్తికరంగా ఉంది అన్న స్పందన లభించడం జరిగింది.


ఇటివలే విడుదలైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్ చూశాక సినిమాలో సుమంత్ పాత్ర ఆకట్టుకునే విధంగా తయారు చేశారు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. సీతారాముల ప్రేమ కథకి ఆయన పాత్ర ఏ రకంగా ఉపయోగ పడుతుంది అనే ఆలోచన ప్రేక్షకుల్లో వచ్చింది.

ఇక ‘ సీతా రామం’ ని తను నటించిన ‘గోదావరి’ వంటి క్లాసిక్ సినిమాతో పోల్చి అంచనాలు మరింత పెంచారు హీరో సుమంత్. 2006 లో దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన “గోదావరి” చిత్రం ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ఇప్పుడు ‘ గోదావరి ‘ చిత్రంతో ‘సీతా రామం’ ని పోల్చడంతో సుమంత్ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. సుమంత్ మాట్లాడుతూ.. ” నేను ఈ ఈవెంట్ కి చాలా క్యాజువల్ గా వచ్చేసాను. కానీ మా హీరో దుల్కర్ సూటు బూటు వేసుకొని వచ్చాడు. ఎప్పుడు.. టీ షర్ట్ లు వేసుకునే మా డైరెక్టర్ కూడా షర్ట్ వేసుకుని వచ్చాడు.

READ  Samantha VS Vijay: విజయ్ సినిమాలో సమంత


వచ్చేసారి నుండి ప్రమోషన్స్ కు నేను కూడా సూటు బూటు వేసుకొనే వస్తాను. ఇక ఈ సినిమా 150 పేజీల కథ మొత్తం చదివిన తర్వాత ‘సీతా రామం’ దృశ్య కావ్యం అవుతుంది అని నాకు అనిపించింది. గతంలో నేను ‘గోదావరి’ అనే సీతారాముల కథ చేశాను ఆ సినిమా అందరికీ గుర్తుంది కదా. ఆ సినిమా అప్పుడు క్లాసిక్ గా నిలిచింది.

ఇప్పుడు ‘సీతా రామం’ కూడా అలాగే క్లాసిక్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా పై నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఇందులో చాలా మంచి పాత్ర చేశాను. ఆగస్టు 5 తారీఖు కోసం ఎదురుచూస్తున్నాను. ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఆగస్టు 5న అందరం థియేటర్లో కలుద్దాం” అంటూ చెప్పుకొచ్చారు సుమంత్.

Follow on Google News Follow on Whatsapp

READ  OTT - ది గ్రే మ్యాన్ రివ్యూ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories