దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సీతా రామం”. ఈ సినిమాని ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను మమ్మురం చేస్తూ ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు. అలాగే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను విడుదల చేసింది.తాజాగా సీతా రామం చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు అంటే జూలై 25వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో తమిళ పరిశ్రమకు చెందిన దర్శకుడు మరియు నటుడు అయిన ఒక్టు వంటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే తెలుగు హీరో సుమంత్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక చావ్లా కూడా ఈ సినిమా లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ ముగ్గురి కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను కూడా చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి చక్కని స్పందన లభించడంతో పాటు సినిమాలో వారి పాత్రలు ఏ రకంగా ఉంటాయో అన్న ఆసక్తి ప్రేక్షకులలో కలిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిన రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.ఇలా ఇంతమంది నటీ నటులు ఈ సినిమాలో నటిస్తుండడం వల్ల చిత్రం పట్ల చక్కని క్రేజ్ ఏర్పడింది. సీతా రామం సినిమా యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతుంది. దర్శకుడు హను రాఘవపూడికి ఇంతవరకూ సరైన హిట్ లేకపోయినా.. ప్రేమకథ లను తెరకెక్కించడంలో తనదైన శైలి ఉన్నట్లుగా ఆయనకు ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో ఇమేజ్ దక్కించుకున్నారు.
ఇక ఈరోజు విడుదలైన ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం..
ట్రైలర్ చూస్తే ఈ సినిమా ప్రస్తుత కాలమానానికి 1965 కాలానికి మధ్య జరిగే కథలా స్పష్టంగా అర్ధం అవుతుంది. రామ్ సీతల ప్రేమకథ గురించి, వారి ఇద్దరి జీవితంలో ప్రశ్నార్ధకంగా మిగిలిన ఉత్తరం గురించి వెతికే పాత్రలో రష్మిక మందాన్న కనిపిస్తిన్నారు. అసలు ఆమెకు సీతారామలకు మధ్య సంబంధం ఎంటి? వారిద్దరి ప్రేమకధకు ఎలాంటి ముగింపు లభించింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూసే తెలుసుకోవాలి.
ఇక ట్రైలర్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లు ఇద్దరూ అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేమికులుగా చక్కగా కుదిరారు. ఇక ట్రైలర్ లో ఆహ్లాదకరమైన విజువల్స్, అద్భుతమైన నేపథ్య సంగీతం కూడా ఉన్నాయి.