Homeసినిమా వార్తలుశివ కార్తికేయన్ ప్రిన్స్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

శివ కార్తికేయన్ ప్రిన్స్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

- Advertisement -

కోలీవుడ్‌లోని ప్రముఖ స్టార్‌లలో శివ కార్తికేయన్‌ ఒకరు. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో స్టార్ హీరోగా ఆయన రేంజ్ బాగా పెరిగిపోయింది. అయితే అతని తాజా చిత్రం ప్రిన్స్ మాత్రం ఆయన సూపర్ స్టార్ డమ్ బాటలో బ్రేకులు వేసి విజయాల బాటలో స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది.

నిజానికి ప్రిన్స్ సినిమా కంటెంట్ డీసెంట్‌గా ఉన్నప్పటికీ అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కడుపుబ్బా నవ్వులు పూయించాల్సిన ఈ రొమాంటిక్ కామెడీ డిస్ట్రిబ్యూటర్లను మాత్రం తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. తెలుగు, తమిళ మార్కెట్లలో ప్రిన్స్ నష్టాలు చాలా భారీ స్థాయిలో ఉన్నాయి.

తమిళంలో 30 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా కేవలం 14 కోట్లకు మాత్రమే రికవరీ చేయగలిగింది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా 40-50% మాత్రమే కలెక్ట్ చేయడంతో 50% పైగా నష్టాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం 2.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది, ఇది ప్రిన్స్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు కంటే చాలా తక్కువ.

READ  RRR సీక్వెల్ పై స్పందించిన దర్శకుడు రాజమౌళి

అలానే శివ కార్తికేయన్ నటించిన చివరి చిత్రం వరుణ్ డాక్టర్ కంటే ప్రిన్స్ సినిమా తక్కువ కలెక్ట్ చేయడం అందరినీ విస్తు పోయేలా చేసింది.

ఇక ప్రిన్స్ ఓవర్సీస్‌లో 3.5 కోట్ల డీసెంట్ షేర్ వసూలు చేసింది. నిజానికి ప్రిన్స్ సినిమా బాగా వసూళ్లు సాధించిన ఏకైక ప్రాంతం ఓవర్సీస్ మాత్రమే. మిగతా అన్ని ఏరియాలలోనూ పేలవమైన కలెక్షన్లు వచ్చాయి.

ప్రిన్స్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 48 కోట్లకు క్లోజ్ అయింది. ఆ రకంగా చూసుకుంటే ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్ల నష్టం వాటిల్లింది,. మొత్తంగా ప్రిన్స్ శివ కార్తికేయన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. నిజానికి ఇలాంటి మంచి కంటెంట్‌ ఉన్న సినిమాకి సరైన కలెక్షన్లు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రమోషన్స్ లేదా రిలీజ్ డేట్ బాగుంటే ప్రిన్స్ సినిమా నష్టాల పాలు కాకుండా ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో ఉక్రేనియన్ నటి మరియా ర్యాబోషప్కా కథానాయిక పాత్రలో నటించగా.. థమన్ సంగీతం అందించారు.

READ  ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌లను అందించిన ఇద్దరు లెజెండ్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories