Homeసినిమా వార్తలువివాదం రేపుతున్న విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు

వివాదం రేపుతున్న విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవలే వరుస హిట్లతో తనదైన ఇమేజ్ ను స్టార్డం ను సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. నిజానికి ఇప్పుడు ఆయన పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రౌడీ అనే టాగ్ ను ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం లైగర్.ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఘనంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు మరియు టీజర్లు ప్రేక్షకులని ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా లైగర్ చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు పెద్ద సంఖ్యలో సుదర్శన్ థియేటర్ వద్ద చేరుకొని భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానుల నడుమ ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.

అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఈ రచ్చ ఏందిరా భయ్యా అంటూ వ్యాఖ్యానించారు.

READ  రీమేకులు మేకులు అయ్యాయి -4 కోట్ల నష్టం వచ్చిందన్న దిల్ రాజు

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు తరలి వచ్చిన అభిమానులను చూసి విజయ్ .. అసలు మా తాత ఎవడో తెలియదు మా నాన్న ఎవరో తెలీదు కానీ మీరు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఈ సినిమా మీకే అంకితం అంటూ ప్రేక్షకులను రంజింప చేసేలా మాట్లాడారు. అలాగే ఆగస్టు 25వ తేదీ ఈ సినిమా విడుదలై ఇండియాని షేక్ చేస్తుంది.. ఇది రాసి పెట్టుకోండి అంటూ సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా తనకి డాన్స్ రాకపోయినా అభిమానుల కోసం కష్టపడి చేశానని తెలిపారు.

అయితే విజయ్ దేవరకొండ మాట్లాడిన వ్యాఖ్యలపై పలువురు ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు.మా తాత ఎవరో తెలీదు మా నాన్న ఎవరో తెలియదు అంటూ విజయ్ ఉద్దేశించింది ఇండస్ట్రీలో ఉన్న హీరోల వారసుల గురించేనని అంటున్నారు. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో వృద్ధిలోకి రాగానే తన తమ్ముడిని హీరోగా పరిచయం చేశారు. ఈమరి అలాంటప్పుడు వారసులను ఉద్దేశిస్తూ ఇలా మాట్లాడటం, ఇతర హీరోలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం మంచి పద్ధతి కాదని విజయ్ దేవరకొండపై సోషల్ మీడియా పై పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఇంకెంత ముదురుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  హ్యపీ బర్త్ డే ట్రైలర్ : వినూత్నమైన హాస్య ప్రయోగం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories