దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సమంత రుత్ ప్రభు. ప్రస్తుతం వరుస చిత్రాలతో తన సత్తా ఏంటో చూపించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. హీరోయిన్ గానే కాకుండా ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్న సమంతా..విలన్ పాత్రలో అలరించనుందట. తమిళ స్టార్ హీరో సినిమాలో ఆమె ఒక ఆసక్తికరమైన విలన్ పాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వివాదాలతో అనవసర రాద్ధాంతం చేయకుండా సమంత వరుస సినిమాలు చేస్తూ తన కెరీర్ పైనే శ్రద్ధ వహిస్తున్నారు. ‘పుష్ఫ’ సినిమాలో స్పెషల్ హట్ సాంగ్ చేసి తన సత్తా చూపించిన తరువాత మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు, సినిమాలు చేయనున్నారు.
పన్నెండేళ్ళ కెరీర్ లో సమంత అటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే కాకుండా గ్లామర్ పరంగా కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా వస్త్ర ధారణతో పాటు స్టైలింగ్ ను మార్చుకుంటూ వచ్చారు.
ఇక గత కొన్నేళ్లుగా బోల్డ్ క్యారక్టర్స్, హాట్ సీన్ లు లేదా సాంగ్ లు చేయడానికి వెనుకాడని సమంత ఇప్పుడు విలన్ పాత్రకు సై అన్నట్టు సమాచారం.
ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ తో “విక్రమ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని తమిళ సూపర్ స్టార్ విజయ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక ఆరుల్ మోహన్ ను అనుకుంటడగా.. విలన్ పాత్రకు సమంత నటించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
విలన్ పాత్ర సమంతకు కొత్తేమీ కాదు. గతంలో తమిళంలో వచ్చిన చియాన్ విక్రమ్ మూవీ ‘10’లో సమంత ద్విపాత్రాభినయం చేయగా అందులో ఒక పాత్ర మెయిన్ హీరోయిన్ అయితే మరో పాత్ర కరుడుగట్టిన విలన్ తరహాలో ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు విజయ్ సినిమాలో విలన్ గా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక సమంత ప్రస్తుతం తను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యశోద’, గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ తో పాటు విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు.