Home సినిమా వార్తలు విజయ్ దేవరకొండ మాటలకు బండ్ల గణేష్ కౌంటర్

విజయ్ దేవరకొండ మాటలకు బండ్ల గణేష్ కౌంటర్

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. అంతే కాదు తన ఎదుగుదలతో ప్రస్తుతం స్టార్ హీరోలకు ఈ రౌడీ హీరో పోటీ ఇస్తున్నారు అంటే అది అతిశయోక్తి కాదు.

ఇక ఆయన తాజాగా క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ తో “లైగర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. విజయ్ – పూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి చిత్రం అయిన ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ ఒక పెద్ద పండగలాగా జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో విజయ్ మాటలు సంచలనాన్ని సృష్టించాయి.విజయ్ దేవరకొండ సినీ కుటుంబానికి చెందిన హీరో కాదనే విషయం తెలిసిందే.

ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ఆయన లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘మా నాన్న ఎవరో మీకు తెలీదు. మా తాత ఎవరో మీకు తెలీదు. రెండేళ్లలో నా సినిమా ఏమీ రాలేదు. అంతకు ముందు వచ్చిన సినిమా కూడా పెద్దగా గుర్తుపెట్టుకునేది కాదు. అయినా మీ అభిమానం అలాగే ఉంది’ అంటూ ఫ్యాన్స్‌ను ప్రశంసించారు విజయ్. ఈ మాటలు అటు సోషల్ మీడియాలో.. ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా సినీ పరిశ్రమలో ఉన్న వారసుల గురించే అనే భావన అందరిలోనూ వచ్చింది.

ఇక పోతే తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టుగా ఆ తరువాత నిర్మాతగా మారారు బండ్ల గణేష్. అయితే ఆయన సినిమాల్లో నటించడం తగ్గినా, పవన్ కళ్యాణ్ చిత్ర ఆడియో ఫంక్షన్లలో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుంటారు, ఇతర ఈవెంట్ లలోనూ ఆయన వచ్చినప్పుడు ఏదో ఒక గోల వాతావరణం ఉంటుంది. ఎందుకంటే బండ్ల గణేష్ ఆ సమయానికి ఏది అనిపిస్తే అది మాట్లాడే రకం కాబట్టి. సీరియస్ విషయాన్ని కాస్త సెటైర్ జోడించి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా ఇటీవలే నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు పూరీ జగన్నాధ్‌ పై ఆయన కొడుకు ఆకాశ్ పూరి హీరోగా చేసిన “చోర్ బజార్” సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన హీరో అయిన విజయ్‌పై కూడా పరోక్షంగా సెటైర్ వేశారు.

https://twitter.com/ganeshbandla/status/1550487588976222209?t=Lwk7xL89YS9dYXrmcIW9-g&s=19

‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేష్ బాబులా, రామ్ చరణ్‌లా, ప్రభాస్‌లా గుర్తుపెట్టుకో బ్రదర్’ అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ఈ ట్వీట్‌లో ఎవరి పేరును ప్రస్తావించకపోయినా.. ఇది ఖచ్చితంగా విజయ్‌ దేవరకొండ వ్యాఖ్యలకు కౌంటర్ అని చూసేవారికి అర్థమయిపోతోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version