యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2. యష్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ లో భాగంగా గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ట్రైలర్ బాగానే రెస్పాన్స్ అందుకోగా తాజాగా ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసారు.
ఆకట్టుకునే కథ, కథనాలతో ఇద్దరు స్టార్స్ నటిస్తున్న ఈమూవీని దర్శకుడు అయాన్ అద్భుతంగా తెరకెక్కించారని, ఆగష్టు 14న రిలీజ్ అనంతరం మూవీ పెద్ద విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క రన్ టైం లాక్ అయింది. దాని ప్రకారం ఈమూవీ మొత్తంగా 3 గం. ల 3 ని.ల పాటు సాగనుంది, అయితే రన్ టైం ఎక్కువ అయినప్పటికీ కూడా ఆద్యంతం మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ అంటోంది.
మరోవైపు ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్స్ తో హీరోలు ఎన్టీఆర్, హృతిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. త్వరలో ఈ మూవీ నుండి వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన స్పెషల్ డ్యాన్స్ నంబర్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు అతి త్వరలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. దాని యొక్క డిటైల్స్ కూడా వెల్లడి కావాల్సి ఉంది.