Homeసినిమా వార్తలులాల్ సింగ్ చద్దా కోసం మెగాస్టార్ స్పెషల్ షో

లాల్ సింగ్ చద్దా కోసం మెగాస్టార్ స్పెషల్ షో

- Advertisement -

బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ న‌టించిన‌ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తుండగా.. ముఖ్యమైన ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మ‌రియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చద్దా’ అనేక సార్లు వాయిదాలు పడిన తరువాత ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమ‌యింది.

ఇటీవల బాలీవుడ్ హీరోలు తెలుగులో మార్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అమీర్ ఖాన్ కూడా ఇక్కడ ప్రమోషన్స్ నిర్వహించబోతున్నారు.

ఈ క్రమంలో ఆయన తెలుగు హీరోలు, దర్శకులకు స్పెషల్ ప్రీమియర్ షో వేయడం జరిగింది. అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య‌ ఎప్పట్నుంచో స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. అలాగే నాగార్జున, చిరంజీవి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే చిరంజీవి ఇంట్లో ఈ సినిమాని ఓ స్పెషల్ ప్రివ్యూ వేశారు. ఈ ప్రివ్యూకి రాజమౌళి, నాగార్జున, సుకుమార్, చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్య.. మరియు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

READ  Ponniyan Selvan Teaser: మణిరత్నం తెరకెక్కించిన మరో అద్భుతం

హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని చిరంజీవి, రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు చూసి అమీర్ ఖాన్ ని అభినందించారు అని తెలియ వచ్చింది.

లాల్ సింగ్ చద్దా సినిమా భారీ విజయం సాధించడం బాలీవుడ్ కు ఎంతో అవసరంగా మారింది. ఎందుకంటే కరోనా మహమ్మారి దాడుల తరువాత హిందీ సినిమాలో స్టార్ హీరోల నుంచి సినిమాలు సరిగా విడుదల కాలేదు. మరీ ముఖ్యంగా ఖాన్ త్రయం నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక అమీర్ ఖాన్ విషయానికి వస్తే 2016 లో వచ్చిన దంగల్ తరువాత ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “లాల్ సింగ్ చద్దా”నే . మరి అమీర్ బాలీవుడ్ ఆశలు నిజమయ్యేలా భారీ విజయం సాధిస్తారా లేరా రెండు నెలలు ఆగితే తెలుస్తుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  ఇక పై పక్కా కమర్షియల్ అంటున్న రానా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories